RR vs LSG : చేజేతులా ఓటమి పాలైన రాజస్థాన్.. రాణించిన లక్నో బౌలర్లు
ఐపీఎల్ -16 సీజన్ ఆరంభం నుంచే ఊహించని రీతిలో ఆడియన్స్ కి షాక్ లు ఇస్తూనే ఉంది. మొదటి మ్యాచ్ నుంచే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేనంత సస్పెన్స్ థ్రిల్లర్ లా మారిపోయింది. కానీ బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జరిగిన జెయింట్స్ మ్యాచ్ అయితే
RR vs LSG : ఐపీఎల్ -16 సీజన్ ఆరంభం నుంచే ఊహించని రీతిలో ఆడియన్స్ కి షాక్ లు ఇస్తూనే ఉంది. మొదటి మ్యాచ్ నుంచే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేనంత సస్పెన్స్ థ్రిల్లర్ లా మారిపోయింది. కానీ బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జరిగిన జెయింట్స్ మ్యాచ్ అయితే రాజస్థాన్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా ఖంగు తినిపించింది. టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాకిచ్చింది.
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్, లక్నో జట్లు తలపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత రాజస్థాన్ జట్టు సొంత గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతుండడం విశేషం అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ప్రత్యర్ధి జట్టు భారీ స్కోరరె ని టార్గెట్ ని ఇవ్వకపోయినా పోయినా.. రాజస్థాన్ మాత్రం చేజేతులా ఓటమి పాలయ్యింది. లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ కు ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. జోస్ బట్లర్ (41 బంతుల్లో 40, 4 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హొ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ హాఫ్ సెంచరీకి దగ్గరైన జైశ్వాల్‌ను స్టోయినిస్ ఔట్ చేయడంతో రాజస్థాన్ వికెట్ల పతనం మొదలైంది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ (1) ఊహించని రీతిలో రనౌట్ కాగా, బట్లర్‌తో పాటు ఫామ్‌లో హెట్మయర్(2) కూడా ఔట్ కావడంతో 104 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక చివర్లో దేవదత్ పడిక్కల్ (21 బంతుల్లో 26, 4 ఫోర్లు ) రాణించినా రాజస్తాన్ కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆరు మ్యాచ్ లలో ఇది రెండో ఓటమి కాగా.. లక్నోకు ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలుపొందింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(39; 32 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్), కైల్ మేయర్స్(51; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించారు. అయితే.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 11 ఓవర్లకు 82 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత వెంటనే రాహుల్, ఆయుష్ బదోని (1) క్లీన్ బౌల్డ్ కావడంతో 86 పరుగులకే లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కైల్ మేయర్స్ 40 బంతుల్లో అర్ధశతకంతో రాణించడంతో లక్నోకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ (21; 16బంతుల్లో 2 ఫోర్లు), నికోలస్ పూరన్ (28; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మలు ఒక్కో వికెట్ పడగొట్టారు.