Last Updated:

SRH vs MI: ఉప్పల్ వేదికగా మ్యాచ్.. హ్యాట్రిక్ కొట్టేదెవరో..?

SRH vs MI: ఐపీఎల్ లో మరో పోరుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. ఇక సన్‌రైజర్స్ సొంత మైదానంలో మ్యాచ్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడనుంది.

SRH vs MI: ఉప్పల్ వేదికగా మ్యాచ్..  హ్యాట్రిక్ కొట్టేదెవరో..?

SRH vs MI: ఐపీఎల్ లో మరో పోరుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. ఇక సన్‌రైజర్స్ సొంత మైదానంలో మ్యాచ్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు తలపడనుంది. ఈ జట్లు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచాయి. ఇరు జట్లు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

ఉప్పల్ వేదికగా మ్యాచ్.. (SRH vs MI)

ఐపీఎల్ లో మరో పోరుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. ఇక సన్‌రైజర్స్ సొంత మైదానంలో మ్యాచ్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు తలపడనుంది. ఈ జట్లు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచాయి. ఇరు జట్లు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

ఇవాళ ముంబయికి కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మతోపాటు.. కవల సోదరులు డ్యూన్‌ జాన్‌సెన్‌, మార్కో జాన్‌సెన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రస్తుతం ఇరుజట్లు నాలుగేసి మ్యాచులు ఆడాయి. ఇందులో ఇరు జట్లు.. తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడి.. తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఎవరు గెలిచినా వారికి హ్యాట్రిక్‌ విజయం అవుతుంది.

బ్రూక్‌ మరోసారి..

అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో బ్రూక్ ఒకడు. గత మ్యాచ్ లో బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మరోసారి అదే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. సన్ రైజర్స్ కెప్టెన్ కూడా.. మంచి ఫామ్ లో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్ శర్మ, మయాంక్‌ అగర్వాల్ రాణిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. ఇక బ్రూక్ పై ముంబయి బౌలర్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. తొలి మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన అర్జున్‌ తెందూల్కర్‌ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి మరి.

ఫామ్ లోకి వచ్చిన సూర్య..

సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం ముంబయికి కలిసొచ్చే అంశం. వరుస మ్యాచుల్లో విఫలం అవుతున్న సూర్య.. గత మ్యాచ్ లో రాణించాడు.

అతడితోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్‌, సూర్య, తిలక్‌ వర్మ, కామెరూన్ గ్రీన్, టిమ్‌ డేవిడ్‌, స్టబ్స్‌తో కూడిన ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగా ఉంది.

వీరిలో ఏ ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోయినా భారీ స్కోర్లుగా మలచగల సత్తా వారి సొంతం.

అయితే భువనేశ్వర్‌ కుమార్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

పిచ్ రిపోర్ట్‌..

హైదరాబాద్‌ వేడి వాతావరణం వల్ల ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అయితే, స్పిన్నర్ల ప్రభావం కాస్త ఉండనుంది.

తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ భారీ స్కోరు చేసిన.. రెండో మ్యాచులో మాత్రం పంజాబ్ ను సన్ రైజర్స్ కట్టడి చేసింది.

ముఖాముఖి

హైదరాబాద్‌, ముంబయి జట్లు ముఖాముఖిగా 19 మ్యాచుల్లో తలపడ్డాయి. అయితే, ముంబయి 10 సార్లు, హైదరాబాద్‌ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి.

హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 193 పరుగులు కాగా.. ముంబయి మాత్రం ఏకంగా 235 పరుగుల అత్యధిక స్కోరును సాధించింది.