Last Updated:

Kanguva : “కంగువ” గా రానున్న సూర్య.. ఏకంగా 10 భాషల్లో.. గ్లింప్స్ చూస్తే పూనకాలే

నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని, సింగం

Kanguva : “కంగువ” గా రానున్న సూర్య.. ఏకంగా 10 భాషల్లో.. గ్లింప్స్ చూస్తే పూనకాలే

Kanguva : నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని, సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపును పొందాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక చిత్రంలో చేస్తున్నాడు.  కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు.

శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి తాజాగా టైటిల్‌ని ప్రకటించారు. `కంగువ` అనే పేరుని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. తన కెరీర్ లో 42 వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని పాన్ ఇదనియ లరరేనజ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇక యానిమేటెడ్ స్టైల్ లో ఉన్న ఆ వీడియో ఫ్యాన్స్ అందరికీ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. `కంగువ` అంటే అగ్ని శక్తి ఉన్న యోధుడు, శక్తివంతమైన పరాక్రమవంతుడు అని అర్థం. దీంతో సూర్య ఇందులో గతంలో ఎప్పుడూ కనిపించనటు వంటి యుద్ధ వీరుడిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది.  2024 ప్ర‌థ‌మార్థంలోనే కంగువా సినిమాను విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్రొడ్యూస‌ర్స్ చెప్పేశారు. ప్రస్తుతం ఈ మోషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైటిల్ వీడియోలో సూర్య లుక్‌ను పూర్తిగా రివీల్ చేయ‌కుండా వెనుక నుంచే చూపించారు. ఆయ‌న ధ‌రించిన ఆయుధాలు, గుర్రం మీద కూర్చుని ఉండ‌టం, ఆయ‌న వెనుక వేలాదిగా సైన్యం.. ఇవ‌న్నీ చూస్తుంటే సూర్య మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌లో మెప్పించ‌టం ప‌క్కా అనిపిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. వచ్చే నెలల్లో మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయనున్నట్టు టీమ్‌ వెల్లడించింది. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్ లు, సీజీ వర్క్, వీఎఫ్‌ ఎక్స్ భారీగా ఉంటాయని, దీంతో పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది.

ఇక ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొందుతోంది. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని పది భాషల్లో భారీ పాన్‌ ఇండియా చిత్రంగా 3డీలో తెరకెక్కిస్తున్నారు. అలానే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండటం విశేషం. తాజాగా విడుదల చేసిన టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ని డిఎస్పీ అదరగొట్టేశాడు అని ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో సూర్య ఏకంగా 13 విభిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని టాక్‌.  మ‌రి సూర్య ఫ‌స్ట్ లుక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.