CSK vs RR: చివర్లో తడబడిన రాజస్థాన్.. చెన్నై లక్ష్యం 176
CSK vs RR: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చివర్లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో జోస్ బట్లర్ 52 పరుగులతో రాణించాడు. పడిక్కల్ 38 పరుగులు చేయగా.. అశ్విన్, హెట్ మేయర్ చెరో 30 పరుగులు చేశారు.
చెన్నై బౌలింగ్ లో ఆకాష్ సింగ్, దేశ్ పాండే, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మెుయిన్ అలీ ఓ వికెట్ తీసుకున్నాడు.
LIVE NEWS & UPDATES
-
CSK vs RR చివర్లో తడబడిన రాజస్థాన్.. చెన్నై లక్ష్యం 176
నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చివర్లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో జోస్ బట్లర్ 52 పరుగులతో రాణించాడు. పడిక్కల్ 38 పరుగులు చేయగా.. అశ్విన్, హెట్ మేయర్ చెరో 30 పరుగులు చేశారు.
చెన్నై బౌలింగ్ లో ఆకాష్ సింగ్, దేశ్ పాండే, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మెుయిన్ అలీ ఓ వికెట్ తీసుకున్నాడు.
-
CSK vs RR: ఐదో వికెట్ డౌన్.. జోస్ బట్లర్ ఔట్
రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. మెుయిన్ అలీ బౌలింగ్ లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 36 బంతుల్లో బట్లర్ 52 పరుగులు చేశాడు. 16.4 ఓవర్లకు రాజస్థాన్ 143 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో హెట్ మేయర్, ధ్రువ్ ఉన్నారు.
-
CSK vs RR: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్థాన్
రాజస్థాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. పడిక్కల్ 26 బంతుల్లో 38 పరుగులు చేసి ఔట్ అవ్వగా.. సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జడేజా ఈ వికెట్లను పడగొట్టాడు.
-
CSK vs RR: పడిక్కల్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో పడిక్కల్ క్యాచ్ ఔటయ్యాడు. 26 బంతుల్లో 38 పరుగులు చేశాడు పడిక్కల్.
-
CSK vs RR: 8 ఓవర్లో 18 పరుగులు.. రెండు సిక్సులు కొట్టిన బట్లర్
మెుయిన్ అలీ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో బట్లర్ సిక్సులు బాదాడు. దీంతో 18 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం రాజస్థాన్ 86 పరుగులు చేసింది.
-
CSK vs RR: ముగిసిన 7వ ఓవర్.. వికెట్ నష్టానికి 68 పరుగులు చేసిన రాజస్థాన్
7 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 68 పరుగులు చేసింది. జడేజా వేసిన ఓవర్లో.. పది పరుగులు వచ్చాయి. క్రీజులో బట్లర్, పడిక్కల్ ఉన్నారు.
-
CSK vs RR: ముగిసిన పవర్ ప్లే.. వికెట్ నష్టానికి 57 పరుగులు చేసిన రాజస్థాన్
పవర్ ప్లే లో రాజస్థాన్ 57 పరుగులు చేసింది. దేశ్ పాండే వేసిన ఆరో ఓవర్లో పడిక్కల్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
-
CSK vs RR: ఐదో ఓవర్లో 17 పరుగులు.. రెండు ఫోర్లు, ఓ సిక్సర్
ఐదో ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. తీక్షణ వేసిన ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. బట్లర్ ఓ ఫోర్, సిక్సర్ కొట్టగా.. పడిక్కలో మరో ఫోర్ కొట్టాడు.
-
CSK vs RR: నాలుగో ఓవర్లకు 28 పరుగులు.. నెమ్మదిగా రాజస్థాన్ బ్యాటింగ్
వికెట్ పడటంతో రాజస్థాన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. నాలుగు ఓవర్లకు 28 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్, బట్లర్ ఉన్నారు.
-
CSK vs RR: ముగిసిన మూడో ఓవర్.. 22 పరుగులు చేసిన రాజస్థాన్
మూడు ఓవర్లకు రాజస్థాన్ 22 పరుగులు చేసింది. తీక్షణ వేసిన బౌలింగ్ లో పడిక్కల్ రెండు ఫోర్లు సాధించాడు.
-
CSK vs RR: తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. యశస్వి జైస్వాల్ ఔట్
రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. దేశ్ పాండే బౌలింగ్ లో యశస్వి క్యాచ్ ఔటయ్యాడు. 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు యశస్వి. క్రీజులోకి దేవదత్ పడిక్కల్.
-
CSK vs RR: తొలి ఓవర్.. 8 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్
తొలి ఓవర్లో రాజస్థాన్ 8 పరుగులు చేసింది. ఆకాశ్ సింగ్ వేసిన ఓవర్లో యశస్వి రెండు ఫోర్లు కొట్టాడు.
-
CSK vs RR: బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్
టాస్ ఓడిన రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మైదానంలోకి అడుగుపెట్టారు. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్‌ను వేస్తున్నాడు
-
CSK vs RR: ధోని అరుదైన ఘనత..
ఈ మ్యాచ్ లో ధోని అరుదైన ఘనత సాధించనున్నాడు. ఇప్పటికే ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డును సొంతం చేసుకున్నాడు.
అయితే ధోనికి ఇది సీఎస్ కే కు కెప్టెన్ గా 200వ మ్యాచ్ అవుతుంది.
-
CSK vs RR: టాస్ గెలిచిన చెన్నై.. టీం ఇదే
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్
-
CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. రాజస్థాన్ జట్టు ఇదే
రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్