Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!
Pre wedding shoot: ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరికొన్ని ప్రాంతాలను సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
Pre wedding shoot: ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరికొన్ని ప్రాంతాలను సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
ఈ ప్రాంతాలు చాలా బెటర్..
ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరికొన్ని ప్రాంతాలను సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకునే మధురానుభూతి.. పెళ్లికి ముందు జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్లను తీయించుకుంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో తమకు నచ్చిన విధంగా షూట్ చేయించుకుంటున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లకుండా.. తక్కువ బడ్జెట్ లోనే పురాతన కోటలు, అందమైన అటవీ ప్రాంతాలు, ఆహ్లాదకర సముద్ర తీరాలున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.
గోల్కొండ కోట (Pre wedding shoot)
గోల్కొండ నవాబులు పాలించిన కోట. చరిత్రలో ఈ కోటకు ఎంతో ప్రసిద్ధి ఉంది. గోల్కొండ కోట ప్రీ వెడ్డింగ్ షూట్‌కు చాలా అనువైన ప్రాంతం. ఉదయం, సాయంత్రం వేళల్లో వెళితే అద్భుతమైన లోకేషన్లు ఇక్కడ ఉంటాయి. నిజాం కాలంలోని రాతి కట్టడాలు బ్యాక్‌గ్రౌండ్‌కు ఒక రాయల్ లుక్ ను ఇస్తాయి. కోట ప్రవేశద్వారం.. మధ్యలో చూడచక్కని గ్రీనరీ కొత్త జంట స్టిల్స్‌కు సరికొత్త అందాన్ని ఇస్తాయి. హైదరాబాద్ నగరం మొత్తం కన్పించేలా ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
గండి కోట
గండి కోట టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చెందుతోంది. వైయస్ ఆర్ జిల్లా గండికోటలో ఇది ఉంటుంది. కోటలోని జుమ్మా మసీదు, ఎర్ర కోనేరు, మాధవరాయస్వామి, రంగనాయకుల దేవాలయం ప్రత్యేకమైన స్థలాలు. ఇక్కడ మర్చిపోలేని చిత్రాలు తీసుకోవచ్చు. గండికోటకు సమీపంలోని కొట్టాలపల్లె వద్దనున్న గాలి మరలు కూడా ఫొటోషూట్‌కు అనువుగా ఉంటాయి. మైలవరం జలాశయం వద్ద సైతం వివిధ రకాల స్టిల్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
వరంగల్ కోట
వరంగల్ కోట కూడా ప్రత్యేకమైన ప్రాంతం. కాకతీయుల కోట కాస్త.. వరంగల్ కోటగా మారింది. ఈ కోటలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉంటుంది.
13వ శతాబ్దం నాటి కాకతీయ కళా తోరణాల వద్ద చూడచక్కని చిత్రాలు తీసుకోవచ్చు. మెట్లబావులు సహా పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట.
నాలుగు దిక్కుల సింహ ద్వారాల వద్ద వైవిధ్యమైన చిత్రాలను క్లిక్ మనిపించొచ్చు.
అరకు లోయ
ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది అరకు. టూరిస్టులకు ఇది చాలా ఇష్టమైన ప్రాంతం. దీంతో పాటు ఫొటో షూట్లకు స్పాట్ గా మారింది.
ఇక్కడి తూర్పు కనుమల్లో టీ తోటలు ఆహ్లాదంగా కనిపిస్తాయి.
బొర్రా గుహలు, ఆదివాసీ మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ వంటి ప్రదేశాల్లోనూ కెమెరాలను క్లిక్‌మనిపించవచ్చు.
ఇక్కడికి సొంత వాహనంలో వెళ్లడం ఉత్తమం.
రుషి కొండ బీచ్
విశాఖలోని అందమైన ప్రాంతం రుషి కొండ బీచ్. ఇక్కడి తీరంలో కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు కన్పిస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మత్స్యకారులు ఒడ్డున నిలిపి ఉంచిన బోట్ల వద్ద రకరకాల పోజులిస్తూ ఫొటోలు తీసుకోవచ్చు.
తలకోన అటవీ ప్రాంతం
తిరుపతి నుంచి భాకరాపేట మీదుగా సిద్ధేశ్వరాలయానికి వెళ్లి.. అక్కడి నుంచి 2 కి.మీ.లు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తే తలకోన అందాలు సాక్షాత్కరిస్తాయి.
ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు. ఇక్కడ సరికొత్త స్టిల్స్ దిగొచ్చు. ఇక్కడి జలపాతం వద్ద తీసుకునే చిత్రాలు ఆల్బమ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి.
అరుదైన జీవ, వృక్ష జాతులకు ఆవాసమైన తలకోనలో బస చేయడానికి అటవీశాఖ అతిథి గృహాలు కూడా ఉన్నాయి.