SRH vs LSG: చేతులెత్తేసిన సన్ రైజర్స్.. లక్నో లక్ష్యం 122 పరుగులు
SRH vs LSG: లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉత్సాహంతో ఉంది.
SRH vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. సన్ రైజర్స్ జట్టులో సింగ్, రాహుల్ త్రిపాఠి, చివర్లో అబ్దుల్ సమద్ రాణించారు.
సింగ్ 31 పరుగులు, రాహుల్ త్రిపాఠి 35 పరుగులు చేశారు. చివర్లో 10 బంతుల్లో అబ్దుల్ సమద్ 21 పరుగులు చేశాడు.
లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
SRH vs LSG: చేతులెత్తేసిన సన్ రైజర్స్.. లక్నో లక్ష్యం 122 పరుగులు
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. సన్ రైజర్స్ జట్టులో సింగ్, రాహుల్ త్రిపాఠి, చివర్లో అబ్దుల్ సమద్ రాణించారు.
సింగ్ 31 పరుగులు, రాహుల్ త్రిపాఠి 35 పరుగులు చేశారు. చివర్లో 10 బంతుల్లో అబ్దుల్ సమద్ 21 పరుగులు చేశాడు.లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
-
SRH vs LSG: ఐదో వికెట్ డౌన్.. రాహుల్ త్రిపాఠి వెనక్కి
సన్ రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. యాష్ ఠాకూర్ బౌలింగ్ లో త్రిపాఠి క్యాచ్ ఔట్ అయ్యాడు. త్రిపాఠి 41 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
-
SRH vs LSG: ముగిసిన 14వ ఓవర్.. పరుగులు చేయడంలో తడబడుతున్న సన్ రైజర్స్
వరుస వికెట్లతో సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 ఓవర్లు ముగిసేసరికి 76 పరుగులు చేసింది. పరుగులు చేసేందుకు బ్యాటర్లు కష్టపడుతున్నారు.
-
SRH vs LSG: ముగిసిన 13వ ఓవర్.. నెమ్మదిగా హైదరాబాద్ బ్యాటింగ్
వరుస వికెట్లు పడటంతో హైదరాబాద్ నెమ్మెదిగా బ్యాటింగ్ చేస్తోంది. 13 ఓవర్లకు 72 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
-
SRH vs LSG: ముగిసిన 11వ ఓవర్.. 65 పరుగులు చేసిన సన్ రైజర్స్
11 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుత్ త్రిపాఠి, సుందర్ ఉన్నారు.
-
SRH vs LSG: నాలుగో వికెట్ డౌన్.. కష్టాల్లో సన్ రైజర్స్
హైదరాబాద్ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. హారీ బ్రుక్ స్టంపౌట్ రూపంలో వెనుదిరిగాడు. రివి బిష్ణోయ్ బౌలింగ్ లో స్టంప్ గా వెనక్కి వెళ్లాడు. తొమ్మది ఓవర్లకు సన్ రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.
-
SRH vs LSG: మూడో వికెట్ డౌన్.. కెప్టెన్ మరక్రామ్ డకౌట్
వరుస బంతుల్లో సన్ రైజర్స్ వికెట్లు కోల్పోయింది. వచ్చిరాగానే జట్టు కెప్టెన్ మరక్రామ్ డకౌట్ అయ్యాడు.
-
SRH vs LSG: రెండో వికెట్ డౌన్.. కృనాల్ బౌలింగ్ లో సింగ్ ఔట్
సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో సింగ్ ఎల్ బీడబ్యూ గా వెనుదిరిగాడు. సింగ్ 26 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
-
SRH vs LSG: 7 ఓవర్లకు 48 పరుగులు చేసిన రైజర్స్
7 ఓవర్లకు 48 పరుగులు చేసింది సన్ రైజర్స్.
-
SRH vs LSG: ముగిసిన పవర్ ప్లే.. 43 పరుగులు చేసిన సన్ రైజర్స్
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది.
-
SRH vs LSG: ఐదో ఓవర్.. తొమ్మిది పరుగులు చేసిన సన్ రైజర్స్
ఐదో ఓవర్లో సన్ రైజర్స్ తొమ్మిది పరుగులు చేసింది. ఈ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు వచ్చాయి. ఐదు ఓవర్లకు సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
-
SRH vs LSG: ముగిసిన నాలుగో ఓవర్.. నెమ్మదిగా రైజర్స్ బ్యాటింగ్
నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 24 పరుగులు చేసింది. క్రీజులో అల్ మెన్ ప్రీత్ సింగ్, రాహుత్ త్రిపాఠి ఉన్నారు.
-
SRH vs LSG: తొలి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. అగర్వాల్ ఔట్
మూడో ఓవర్లో సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ వేసిన మూడో ఓవర్లో మయాంక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ 21 పరుగులు చేసింది.
-
SRH vs LSG: రెండో ఓవర్.. 10 పరుగులు చేసిన హైదరాబాద్
ఉనద్కత్ వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ చివరి బంతిని అన్ మెల్ ప్రీత్ సింగ్ సిక్సర్ గా మలిచాడు. రెండు ఓవర్లకు సన్ రైజర్స్ 15 పరుగులు చేసింది.
-
SRH vs LSG: తొలి ఓవర్.. ఐదు పరుగులు చేసిన సన్ రైజర్స్
తొలి ఓవర్ లో సన్ రైజర్స్ ఐదు పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్, అన్ మెల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.
-
SRH vs LSG: హైదరాబాద్ బ్యాటింగ్.. లక్నో జట్టు ఇదే
కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హూడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్
-
SRH vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. టీం ఇదే
మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్