Punjab Cops: పోలీసులకు సెలవులు దూరం చేసిన అమృత్ పాల్
ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
Punjab Cops: ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర పోలీసులకు సెలవులు రద్దు చేశారు. ఏప్రిల్ 14 వరకు సెలవులన్నింటినీ రద్దు చేయడంతో పాటు, కొత్తగా సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నెలలో సిక్కులతో సమావేశం కావాలని అమృతపాల్ భావిస్తున్నస్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు సెలవులను కూడా క్యాన్సిల్ చేసినట్టు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ సమాచారం అందించారు. ఇప్పటికే అన్ని సెలవులు రద్దు చేయడంతో పాటు.. ఈ నెల 14 వరకు కొత్తగా ఎలాంటి లీవులు లేవని ఆదేశాలు జారీ చేశారు.
వైరల్ అయిన వీడియోలు
ఈ నెల 14 న వైశాఖి ఉత్పవం సందర్భంగా ‘ సర్బత్ ఖల్సా’ ఏర్పాటు చేయాలని తన సానుభూతి పరులకు అమృతపాల్ చెప్పినట్టు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. సదరు వీడియోలో.. వైశాఖి సందర్భంగా అమృత్‌సర్‌లోని అకల్ తఖ్త్ నుంచి బటిండాలోని డండమ సాహిబ్ వరకూ ఊరేగింపు జరపాలని అకల్ తఖ్ చీఫ్‌లను అమృత్‌పాల్ కోరారు. అయితే దీనిపై అకల్త్ తఖ్ చీఫ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రెవాల్ తెలిపారు. చివరిసారిగా షర్బత్ ఖల్సా కాంగ్రిగేషన్ 1986 ఫిబ్రవరి 16లో జరిగింది. దీంతో పంజాబ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
అవన్నీ ఊహాగానాలే..(Punjab Cops)
రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొడుతున్నాడనే ఆరోపణలపై అమృత పాల్ సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్లాన్ చేశారు. కానీ అతను పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. గత మార్చి 18 నుంచి అమృతపాల్ పరారీలో ఉన్నాడు. గత వారంలో అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద లొంగిపోయినట్టుు కొన్ని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఊహాగానాలే అని శాంతి భద్రతల విభాగం డిప్యూటీ కమిషనర్ కొట్టి పారేశారు. ఒక వేళ అమృతపాల్ లొంగిపోవాలని అనుకుంటే చట్టప్రకారం అదుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.