Harish Rao: పట్టపగలే దొరికిన దొంగ ‘బండి సంజయ్’.. హరీష్ రావు కామెంట్స్
Harish Rao: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ పాత్రపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాజపా కావాలనే విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించి.. ప్రభుత్వాన్ని బద్నా చేయాలని చూస్తోందని ఆరోపించారు.
Harish Rao: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ పాత్రపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాజపా కావాలనే విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించి.. ప్రభుత్వాన్ని బద్నా చేయాలని చూస్తోందని ఆరోపించారు. భాజపా కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
బండి సంజయ్ అడ్డంగా దొరికాడు.. (Harish Rao)
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ పాత్రపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాజపా కావాలనే విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించి.. ప్రభుత్వాన్ని బద్నా చేయాలని చూస్తోందని ఆరోపించారు. భాజపా కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి బండి సంజయేనని ఆరోపించారు. ఈ మేరకు మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. అధికారం కోసం ఆ పార్టీ నేతలు ఏదైన చేయడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. భాజపా నేతలకు దమ్ముంటే.. రాజకీయంగా పోరాటం చేయాలని సవాల్ విసిరారు.
నిందితుడు భాజపా కార్యకర్త..
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు కరుగుగట్టిన భాజపా నేత అని హరీష్ రావు అన్నారు.
నిందితుడు భాజపా కార్యకర్త కాకపోతే.. అతడిని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
భాజపా నేతలకు చదువు విలువ తెలియదని.. ఆ పార్టీలో చదువుకున్నవాళ్లు తక్కువ ఉన్నారని మంత్రి అన్నారు.
రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీళ్లవి. తాండూరు, వరంగల్ పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ ఉన్నట్లు ఆరోపించారు.
పేపర్ లీకేజీతో పాటు.. బీజేపీ అనేక కుట్రలకు పాల్పడిందని మంత్రి అన్నారు. విద్యార్ధుల జీవితాలతో భాజపా చెలగాటం ఆడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.
భాజపా చేసే ఇలాంటి డ్రామాలు కేసీఆర్ దగ్గర నడవవని మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిపోయారు.
ఇవాళ ప్రశ్నపత్రాల లీకేజీలో కూడా అడ్డంగా దొరికిపోయారని అన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హరీష్ రావు అన్నారు.
నిందితులు ఎంతటివారైన కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.