Rishi Sunak: ప్రైవేట్ జెట్ల ప్రయాణాలకు రూ.4 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
బ్రిటన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దేశంలోని ప్రతి రంగానికి చెందిన ఉద్యోగులు రోడ్డెక్కి వేతనాలు పెంచండి మహా ప్రభో అంటూ సమ్మె చేస్తున్నారు.
Rishi Sunak: బ్రిటన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రజలు కట్టే పన్ను సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కేవలం వారం పై చిలుకు రోజులకే 5 లక్షల యూరోలు ప్రైవేట్ జెట్‌లపై ఖర్చు పెట్టి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను గార్డియన్ ప్రచురించింది. ప్రధానమంత్రి రిషి సునాక్ విదేశీ పర్యటనలకు పెద్ద మొత్తంలో వ్యయం చేసిందని పేర్కొంది. కాగా ప్రతిపక్షాలు కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నాయి. వాతావరణం కాలుష్యాన్ని తగ్గిస్తామని హామీలు గుప్పించిన ప్రధానమంత్రి వాతారవణ కాలుష్యాన్ని పెంచుతున్నారని సునాక్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశాయి. కాగా ఈ ఏడాది జనవరిలో అర్థగంట ప్రయాణానికి లండన్ నుంచి లీడ్స్‌కు వెళ్లి ఓ హెల్త్‌కేర్ సెంటర్‌ను సందర్శించడానికి వెళ్లి వచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా అప్పుడు కూడా ప్రధానిపై మండిపడ్డాయి.
జీ-20 సదస్సు టూర్ కు అయిన ఖర్చు ఎంతంటే..(Rishi Sunak)
బ్రిటన్ కేబినెట్ ఆఫీస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రిషి సునాక్ గత ఏడాది నవంబర్‌లో ఒక్క రోజు ఈజిప్టు పర్యటన కాంప్-27 సదస్సుకు వెళ్లివచ్చారు. ప్రైవేట్ జెట్‌కు అయిన ఖర్చు ఒక లక్ష 7వేల 966 పౌండ్లు, అటు తర్వాత ఓ వారానికి ఆయన నవంబర్ 13న బాలిలో జరుగుతున్న జీ-20 సదస్సుకు వెళ్లి వచ్చారు. ఇండోనేషియా టూరు నుంచి ఆయన నవంబర్ 17న తరిగి లండన్‌కు ప్రయాణమయ్యారు. ఈ రౌండ ట్రిప్‌కు అయిన ఖర్చు 3 లక్షల 40వేల యూరోలు.
ఇండోనేషియా టూర్ తర్వాత ప్రధానమంత్రి రిషి సునాక్ ఒక్క రోజు ట్రిప్ కోసం లాటివియా, ఈస్టోనియాకు వెళ్లి అక్కడ బ్రిటన్ సైనికులను కవలిస వచ్చారు. దీనికి అయిన ఖర్చు 62వేల పౌండ్లు. గత ఏడాది ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన లిజ్ ట్రస్ ప్రాగ్‌కు వెళ్లారు. అక్టోబర్ 2022లో ఆమె ప్రాగ్‌కు వెళ్లి వచ్చిన ఖర్చు 40వేల యూరోలు.ఇదిలా ఉండగా సునాక్ వ్యయంపై లిబరల్ డెమోక్రాటిక్‌లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును ప్రధానమంత్రి వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రజలు తమ యుటిలిటి బిల్లులు చెల్లించడానికి నానా ఇబ్బందుల పడుతుంటే సునాక్ మాత్రం ప్రజల సొమ్ముతో రాజభోగం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తింది. కన్సర్వేజిటివ్ ప్రభుత్వం ప్రజలతో సంబంధాలు లేకుండా పోయిందని విమర్శించింది.రిషి సునాక్ వారం కంటే కాస్తా ఎక్కువ రోజుల పర్యటనకు 5 లక్ష ల యూరోలు వ్యయం చేస్తే ఆయన వసతి, భోజనం, వీసాల కోసం అదనంగా 20 వేల యూరోలవరకు వ్యయం చేసినట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. మొత్తం కలిపితే 5 లక్షల20 వేల యూరోలు కేవలం ప్రధానమంత్రి ఖర్చు. ప్రధానమంత్రితో పాటు అధికారిక పర్యటనకు వెళ్లి వచ్చిన అధికారుల ఖర్చు మాత్రం వీటిలో జత చేయలేదు.
సమర్దించిన ప్రధాని కార్యాలయం..
అయితే ప్రధానమంత్రి అధికారిక నివాసం భవనం టెన్ డౌనింగ్ స్ర్టీట్ అధికార ప్రతినిధి సునాక్ ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనకు వెళ్లి రావడాన్ని సమర్థించారు.
ప్రధానమంత్రి హోదాలో రిషి ప్రపంచ నాయకులతో ద్వైపాక్షి సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరుపుతారు. ఉదాహరణకు సెక్యూరిటీ, డిఫెన్స్, ట్రేడ్‌లకు సంబంధించిన అంశాల గురించి చర్చించాల్సి ఉంటుందని అధికార ప్రతినిధి చెప్పినట్లు గార్డియన్ ప్రతిక వెల్లడించింది.
ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రధానమంత్రి విదేశీ పర్యటన వ్యయాన్ని సమర్థించుకున్నా ప్రజలు ప్రధానమంత్రి రిషి సునాక్‌పై మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. తమ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులతో మీరు ప్రైవేట్ విమానాల్లో షికార్లు చేయడం ఎంత వరకు సబబు మిస్టర్ సునాక్ అంటూ నిలదీస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని సామాన్యుడు సాటుమాటుగా తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు.