BSNL 4G: బిఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ సేవలు ఈ ఏడాది కూడా రానట్లేనా?
ఎస్ఎన్ఎల్ సంస్థ వారు 4జీ నెట్వర్క్ సేవలు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసింది. 2022 ఆగస్టులో 4జీ నెట్వర్క్ తీసుకురావాలని సంకేతాలు కూడా ఎప్పుడో ఇచ్చేసింది. కానీ అనుకున్న సమయానికి మన ముందు తీసుకు రాలేక పోయారు.
BSNL 4G: బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు 4జీ నెట్వర్క్ సేవలు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసింది. 2022 ఆగస్టులో 4జీ నెట్వర్క్ తీసుకురావాలని సంకేతాలు కూడా ఎప్పుడో ఇచ్చేసింది. కానీ అనుకున్న సమయానికి మన ముందు తీసుకు రాలేక పోయారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుందని గుస గుసలు వస్తున్నాయి. అసలు ఎందుకు బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ లాంచ్ చేయడానికి ముందుకు రావడం లేదనేదానికి సరైన కారణం తెలీడం లేదు.
దీంతో ఈ ఏడాదిలో కూడా బిఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ రావడం చాలా కష్టమనిపిస్తుంది. ఈ ఏడాది కుదరకపోతే 2023లోనే వస్తుందని తెలుస్తుంది. అయితే ముందుగా పెద్ద నగరాల్లోనే BSNL 4G నెట్వర్క్ను వస్తుందని బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు తెలిపారు. ఆ తరువాత అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇదంతా అయ్యే సరికి 2024 వరకు పట్టచ్చని అంచనా వేస్తున్నారు. కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ వారి నిధాన పరిస్తితులు చూసి 2025 ఐనా మనం ఆశ్చర్య పడలిసిన అవసరం ఐతే లేదు.
2020 నాటికే బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు 4జీ నెట్వర్క్ సేవలు తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ అనుకుంది కానీ కొన్ని ఆర్థిక కష్టాలు, టెక్నాలజీ సమస్యలు, పరికరాల సరయిన సమయంలో దొరక్క పోవడం ఇలాంటి సమస్యల వాళ్ళ ఆలస్యం చేసింది. ఇప్పుడు ఈ ఏడాదిలో తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా అసలు జరగనట్టుగా కనిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు 2023లో నైనా BSNL 4G లాంచ్ చేయాలని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు కోరుకుంటున్నారు.