Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ – సుజిత్ మూవీ టైటిల్ ఫిక్స్.. బాక్సాఫీస్ ర్యాంపేజ్ పక్కా!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.

Pawan Kalyan OG : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సుజీత్ ప్లాన్ చేశారు. ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఆయన కలిసి కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. అయితే, ఏప్రిల్ షూటింగులో పవన్ కళ్యాణ్ లేని సీన్లు తీయడానికి ప్లాన్ చేశారు. మే నెలలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్ చేస్తున్న చిత్రం.. అలానే ‘ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
టైటిల్ రిజిస్టర్ చేయించిన నిర్మాత డీవీవీ దానయ్య (Pawan Kalyan OG)..
సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, దాని మీద క్యాప్షన్ గుర్తు ఉందా.. ‘ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు’ అని పేర్కొన్నారు. ఇప్పుడు దానినే టైటిల్ కింద ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు నిర్మాత డీవీవీ దానయ్య. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో డీవీవీ చేస్తున్న రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కొంత పూర్తి అయ్యింది. సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- UPI Payments: యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.. అసలు విషయం ఇదే
- Priyanka Chopra : బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది.. ప్రియాంక చోప్రా
- Karnataka Assembly Election Schedule: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల