Mid Air Collided: ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు..
నేపాల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ A-320 శుక్రవారం ఉదయం కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది.
Mid Air Collided: ఆకాశంలో భారీ ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు గాలిలోనే ఢీకొన బోయాయి. అయితే సకాలంలో రాడార్ హెచ్చరిక సంకేతాలతో త్రుటిలో తప్పించుకున్నాయి. దీంతో గగనతలంలో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పినట్టయింది.
అసలేం జరిగిందంటే..(Mid Air Collided)
నేపాల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ A-320 శుక్రవారం ఉదయం కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది. రెండూ దాదాపు ఢీ కొనేంత దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో రెండు విమానాలు ఒకే చోట ఉన్నట్టు రాడార్ సంకేతాలు ఇవ్వడంతో ఇరు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. దీంతో నేపాల్ ఎయిర్ లైన్స్ వెంటనే ఏడు వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Air Traffic Controllers (ATCs) of Tribhuvan International Airport involved in traffic conflict incident (between Air India and Nepal Airlines on 24th March 2023) have been removed from active control position until further notice. pic.twitter.com/enxd0WrteZ
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) March 26, 2023
అధికారులపై సస్పెన్షన్ వేటు
కాగా, కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ పౌర విమానాయాన అథారిటీ.. ఘటన ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే చోటుచేసుకున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనా సమయంలో కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారులపై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై చర్య తీసుకున్నట్టు సీఏఏఎన్ ప్రతినిధి ఒక ట్వీట్‌లో తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.