Covid-19 booster dose: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉచితంగా కరోనా బూస్టర్ డోస్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
New Delhi: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు. ఇకపోతే, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. దేశంలో సోమవారం 10,64,038 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది.