ICC Test Rankings: ర్యాకింగ్స్ లో అదరగొట్టిన భారత ప్లేయర్స్.. అగ్రస్థానికి అశ్విన్
మరో వైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
ICC Test Rankings: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ(ICC )ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను విడుదల
చేసింది.
బ్యాటింగ్ విభాగంలో.. ఆసీస్‌తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం కోహ్లీ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.
8 స్థానాలు ఎకబాకిన కింగ్ కోహ్లీ(ICC Test Rankings)
శ్రీలంకతో తొలి టెస్టులో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ (800) నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. రోడ్డు ప్రమాదానికి గురై..
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రిషభ్ పంత్ 9 వ స్థానంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (739) 10 స్థానంతో భారత్ నుంచి టాప్ -10 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కాగా, ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (915) అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా టాప్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇంతకు ముందు వరకు జేమ్స్ అండర్సన్ (859) తో కలిసి సంయుక్తంగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న అశ్విన్ 10 పాయింట్స్ ను అదనంగా తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో 869 పాయింట్లతో అశ్విన్ కొనసాగుతున్నాడు. టాప్ -10 బౌలర్ల జాబితాలో అశ్విన్ కాకుండా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (780) ఏడో స్థానంలో, రవీంద్ర జడేజా (753) 9 వ స్థానంలో నిలిచారు.
ఆల్‌రౌండర్స్ లోనూ మనమే టాప్(ICC Test Rankings)
మరో వైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను ఉమ్మడిగా గెలుచుకున్న టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా (431), రవిచంద్రన్ అశ్విన్ (359) వరుసగా ఫస్ట్ , సెకండ్ ర్యాంక్‌లో నిలిచారు.
ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ లో కొనసాగుతున్న జడేజా.. బౌలర్ల లిస్ట్‌లో మాత్రం ఒక ర్యాంక్ కిందికి దిగజారి 9వ స్థానంలో నిలిచాడు.
ఇక బ్యాటింగ్‌లో రాణించి.. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ (316) కూడా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 4 వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
రెండో స్థానంలోనే భారత్
అయితే, జట్ల పరంగా చూస్తే ఐసీసీ టాప్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరుగలేదు.
కానీ పాయింట్స్ పరంగా మాత్రం ఆసీస్‌కు దగ్గరగా భారత్ చేరింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (106), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్ (88),
శ్రీలంక (88), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (46), అఫ్గానిస్థాన్ (40) టాప్ -10లో నిలిచాయి.