Last Updated:

oscars 2023: 95వ ఆస్కార్‌ అవార్డు విజేతల జాబితా.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే?

oscars 2023: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ సాధించిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

oscars 2023: 95వ ఆస్కార్‌ అవార్డు విజేతల జాబితా.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే?

oscars 2023: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా ముగిశాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ సాధించిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ అనే సినిమా ఏకంగా ఏడు అవార్డులను అందుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే వరించాయి.

95వ ఆస్కార్‌ అవార్డు విజేతల జాబితా.. (oscars 2023)

ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డెజైన్‌: రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : అలెక్సీ నవానీ
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)
బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్: మావెరిక్‌
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌: ది వేల్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పినాషియో
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)
ఒరిజినల్‌ స్కోర్‌: బ్రెటెల్‌మాన్‌ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)