Last Updated:

Influenza Deaths: ఇన్‌ఫ్లుయెంజా వైరస్ తో ఇద్దరు మృతి?

వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించింది.

Influenza Deaths: ఇన్‌ఫ్లుయెంజా వైరస్ తో  ఇద్దరు మృతి?

Influenza Deaths: దేశంలో కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టింది అనుకున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వ్యాప్తి చెందడం కలవరపెడుతోంది. గత 2, 3 నెలల నుంచి ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

తాజాగా ఈ వైరస్ తో మరణాలు కూడా నమోదు అవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇన్‌ఫ్లుయెంజా ఏ కు ఉప రకమైన హెచ్‌2ఎన్‌2 అనే వైరస్‌ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

హర్యాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఈ వైరస్‌ లక్షణాలతో మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

 

కొవిడ్‌ లాంటి లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత రెండు నెలల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి.

వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించింది.

అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా లో మరో రకమైన హెచ్‌1ఎన్‌1 కేసులు కూడా నమోదైనట్లు సమాచారం.

జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట ఈ వైరస్‌ ప్రధాన లక్షణాలు.

వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ.. దగ్గు మాత్రం సుమారు 3 వారాల వరకు ఉంటోంది.

దీని కారణంగా ఆసుపత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

మంచం పట్టిన కాన్పూర్(Influenza Deaths)

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వ హాస్పిటల్ ఒక రోజులో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు రిపోర్టు అయ్యాయి.

వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా హాస్పిటల్ బయట రోగులు బారులు తీరారు.

మరో పక్క ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లు పోటెత్తారు.

ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

హాల్లెట్‌ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డు నిండిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది అంటే పరిస్థితి తీవ్ర తరం అర్ధమవుతోంది.

‘మెదట 5 నుంచి 6 రోజుల పాటు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి.

ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు తలెత్తడంతో కాన్పూర్‌ లోని హాస్పిటల్ కు తరలించామని హాస్పిటలో లోని ఓ పేషెంట్‌ బంధువు తెలిపారు.

 

ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి

‘నిజానికి ప్రతిఏటా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి కేసులు చూస్తాం. కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది హాస్పిటల్ లో చేరారు.

వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమందికి వెంటిలేటర్స్ చికిత్స అందిస్తున్నాం.

కొవిడ్‌-19 కాకుండా వేరే వైరస్‌గా గుర్తించడం చాలా క్లిష్టం. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌లో ప్రతి ఉప రకానికి ప్రత్యేకమైన కిట్‌ ఉంది ’ అని హాల్లెట్ హాస్పిటల్ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్ రిచా గిరి వెల్లడించారు.