Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి అమిత్ షా
తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
Hyderabad: తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే హాజరుకానున్నట్లు సమాచారం.
ఏడాది పాటు విమోచన దినోత్సవ అమృతోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఇటు టీఆర్ఎస్ కూడా విమోచన దినోత్సవం పై ఫోకస్ పెట్టింది. ఈనెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ విమోచన దినోత్సవం పై చర్చ చేపట్టే ప్లాన్ లో ఉంది.