Last Updated:

Nalgonda MLA: ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిన హోలీ.. ఒకరు మీసం మెలేస్తే మరొకరు తొడగొట్టి!

Nalgonda MLA: ఓ వైపు దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రోజులపాటు ఈ పండగ జరగనుంది. వివిధ రంగులతో ప్రజలు పండగ చేసుకుంటుంటే.. ఓ చోట మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది.

Nalgonda MLA: ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిన హోలీ.. ఒకరు మీసం మెలేస్తే మరొకరు తొడగొట్టి!

Nalgonda MLA: ఓ వైపు దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రోజులపాటు ఈ పండగ జరగనుంది. వివిధ రంగులతో ప్రజలు పండగ చేసుకుంటుంటే.. ఓ చోట మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది. నువ్వా నేనా అనే స్థాయికి ఈ గొడవ చేరింది.

ఏం జరిగిందంటే? (Nalgonda MLA)

ఓ వైపు హోలీ ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు మాత్రం గొడవ జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఒకరు మీసం మెలేస్తే.. మరొకరు తొడగొట్టి సవాల్ విసురుకున్నారు. హోలీ ని యువకులు, వృద్ధులు, పేద, ధనికులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. దేశమంతా రంగులతో ఆనందాలకేలి చేసుకుంటు తేలుతుంటే.. నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యేల మధ్య హోలీ చిచ్చుపెట్టింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు నడిబొడ్డున సెంటర్లో సవాల్‌ విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ హోలీ వేడుక వారి అధిపత్య పోరుకు కారణమయ్యాయి. ఇద్దరు నేతలు ఈ పండగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు పెద్ద ఎత్తున నకిరేకల్ సెంటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. వీరి అనుచరులు పోటాపోటీగా జన సమీకరణ, డీజేలతో ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి డ్రైవర్ మీసం మెలేసి.. తొడగొట్టి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన వేముల వీరేశం కార్యకర్తల భుజాలపైకి ఎక్కి ప్రతి సవాల్ చేయడంతో వీరిద్దరి అనుచరులు పరస్పరం తోసుకున్నారు. ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేముల వీరేశంపై నేరుగా ఫైర్ అయ్యారు.

చిరుమర్తి హాట్ కామెంట్స్..

నకిరేకల్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పందించారు. మాజీ ఎమ్మెల్యేకు ఒకసారి అవకాశం ఇస్తే చేసిన పనులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఉద్దేశించి ఘాటుగా కామెంట్ చేశారు. స్తానికల ప్రజలు.. వీరేశం తొడ కొట్టడాన్ని మీసం మేలయ్యడని అందరూ చూశారని.. అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో కూడా రికార్డు అయిందని అన్నారు. దీనిపై ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారని తెలిపారు. ఉద్రిక్తతకు కారణమైన వీరేశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడంతో.. అనుచరులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఎలా ఉందో అర్ధం అవుతోంది. హోలీ రోజు ఇలా ఘర్షణకు దిగడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.