Last Updated:

Barley Seeds: వీటిలొ శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్

బార్లీ లో ఉండే బి విట‌మిన్ నీటిలో క‌లిగే తత్వాన్ని క‌లిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో స‌హా తీసుకోవాలి.

Barley Seeds: వీటిలొ శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్

Barley Seeds: బార్లీ గింజ‌లు. ఇవి ఒక ర‌కం గ‌డ్డి జాతి గింజ‌లు. బార్లీ గింజ‌లు మ‌న‌కు ఆహారంగా, ఔష‌ధంగా పని చేస్తాయి. వీటిలో పిండి ప‌దార్థాలు, పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటాయి. అరుగుద‌ల శ‌క్తిని పెంచ‌డంలో బార్లీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఒక క‌ప్పు ఉడికించిన బార్లీ గింజ‌ల్లో 4.5 గ్రాముల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటుంది. అంతే కాకుండా బార్లీ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి.

గ్లూటెన్ ప‌దార్థాలతో ఎల‌ర్జీ ఉండే వాళ్లు వీటిని తీసుకోకపోవడమే మంచిది. బార్లీ గింజ‌ల‌ను త‌డి లేని,

గాలి త‌గ‌ల‌ని డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల పోషకాల‌ను కోల్పోకుండా కొన్ని నెల‌ల వ‌ర‌కు తాజాగా ఉంటాయి.

వివిధ ర‌కాల సూప్ ల త‌యారీలో కూడా బార్లీ గింజ‌ల‌ను ఉప‌యోగిస్తారు.

 

7 Health Benefits of Barley - Is Barley Better Than Rice?

 

కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో( Barley Seeds)

బార్లీ లో ఉండే బి విట‌మిన్ నీటిలో క‌లిగే తత్వాన్ని క‌లిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో స‌హా తీసుకోవాలి.

మ‌ద్య‌పానం త‌యారీలో కూడా ఈ బార్లీ గింజ‌ల‌ను ఉప‌యోగిస్తారు. బార్లీ గింజ‌ల‌ను నాన బెట్టిన నీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న నీటి శాతం త‌గ్గుతుంది.

ఒంట్లో నీరు చేరిన గ‌ర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజలు నాన‌బెట్టిన నీళ్లను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా బ‌ల‌హీనంగా, నీర‌సంగా ఉన్న వాళ్లు బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది.

అంతే కాకుండా వీటితో ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా, తేలిక‌గా జీర్ణ‌మ‌వుతాయి.

బార్లీ గింజ‌ల నుండి తీసిన నూనెను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

 

బరువు తగ్గాలనుకుంటే

పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్లు పెద్దలు.

అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది.

వేసవిలో అరగుదలతో బాధపడే వారు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది

పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.

ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి.

మధుమేహం ఉన్న వారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.

ఇన్సులిన్‌ కూడా అదుపులోనే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

 

 

మూత్రంలో ఇన్ఫెక్షన్లకు

రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.

మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌.

ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.