Last Updated:

iPhone charging feature: ఐఫోన్ లో అప్ డేట్ ఎకో ఫీచర్

ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్‌ సంస్థ ‘క్లీన్‌ ఎనర్జీ చార్జింగ్‌’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఐఓఎస్‌ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్‌ గత సెప్టెంబరులోనే విడుదలైంది.

iPhone charging feature: ఐఫోన్ లో అప్ డేట్ ఎకో ఫీచర్

iPhone charging feature: ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్‌ సంస్థ ‘క్లీన్‌ ఎనర్జీ చార్జింగ్‌’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఐఓఎస్‌ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్‌ గత సెప్టెంబరులోనే విడుదలైంది.

దీంతో సెలక్టివ్‌ పవర్‌ సోర్స్‌ల దగ్గర మాత్రమే ఐఫోన్లకు చార్జింగ్‌ చేసే వీలుపడుతుంది.

ఇంకా చెప్పాలంటే ఈ ఫీచర్‌ ఉన్న ఐఫోన్‌లు కర్బన ఉద్ఘారాలను తక్కువగా వెలువరించే విద్యుత్తుతో మాత్రమే చార్జింగ్‌ అవుతాయి.

ఈ ఫీచర్‌(Clean Energy Charging) ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. పర్యావరణంపై ఆందోళన చెందుతున్న మరికొన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.

 

ఆప్టిమైజ్డ్‌ బ్యాటరీ చార్జింగ్‌తో ఈ ఫీచర్‌(iPhone charging feature)

వాస్తవానికి ఈ అప్డేట్‌ చేయగానే ఐఫోన్‌ యాక్టివేట్‌ అవుతుంది. దాన్ని చార్జర్‌తో కనెక్ట్‌ చేసినప్పుడు లోకల్‌ ఎనర్జీ గ్రిడ్‌ నుంచి వచ్చే కర్బన ఉద్ఘారాలను ఫోన్ అంచనా వేస్తుంది. క్లీన్‌ ఎనర్జీ అవుతోందని డిటెక్ట్‌ అయిన తర్వాత మాత్రమే చార్జింగ్‌కు అయ్యేందుకు ఛాన్స్ ఇస్తుంది.

అదే విధంగా ఈ మోడ్‌ ఆప్షనల్‌. ఒక క్లిక్‌ చేస్తే సదరు మోడ్ ను వదిలించుకోవచ్చు. ఆప్టిమైజ్డ్‌ బ్యాటరీ చార్జింగ్‌తో కలిసి ఈ ఫీచర్‌ పనిచేస్తుందనే విషయాన్ని యూజర్లు గ్రహించాలని యాపిల్‌ తెలిపింది.

అలాగే ఈ ఫీచర్‌ ప్రత్యేకించి కొన్ని లొకేషన్స్‌లో మాత్రమే పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

 

ఆ ఘనత యాపిల్ దే

బిలియన్‌కు మించి యాక్టివ్‌ యూజర్లు ఐఫోన్‌(iPhone) కు ఉన్నారు. నిజానికి ఇటువంటి ఫీచర్‌ను మొట్టమొదటిసారి యాపిల్ తీసుకువస్తోంది.

యాపిల్‌ సపోర్ట్‌ లో చెప్పిన ప్రకారం – చార్జింగ్‌ కోసం ఎక్కువ సేపు కనెక్ట్‌ అయి ఉందని ఐఫోన్‌ ఊహించినప్పుడు,

తీసేసినప్పటికీ ఫుల్‌ చార్జింగ్‌ ఉందని తెలియజేసేలా అల్గోరిథమ్‌ ఈ ఆప్షన్‌తో సాధ్యమవుతుంది.