Vladimir Putin: లగ్జరీ ఎస్టేట్ లో.. లవర్ తో పుతిన్ రహస్య నివాసం..
దాదాపు రూ. 999 కోట్లు విలువ చేసే ఈ ఎస్టేట్ ను రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి నిర్మించినట్టు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.
Vladimir Putin: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురించి ఏ వార్త అయినా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పుతిన్ కు గురించి కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్ అలీనా కబయేవాతో కలిసి మాస్కో సమీపంలోని ఓ లగ్జరీ విల్లాలో రహస్యంగా నివసిస్తున్నట్టు ఓ వార్తా కథనం వెల్లడించింది.
దాదాపు రూ. 999 కోట్లు విలువ చేసే ఈ ఎస్టేట్ ను రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి నిర్మించినట్టు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.
ఈ ఎస్టేట్ లో అనేక బిల్డింగ్స్ ఉన్నాయని, వారి ముగ్గురు పిల్లల కోసం ఓ ప్లే గ్రౌండ్ కూడా ఉందని ఉందని వార్తా కధనం తెలిపింది.
రిలేషన్లో అలినా, పుతిన్ (Vladimir Putin)
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జిమ్నాస్ట్ అయినా అలినా కబేవా(39)తో పుతిన్ రిలేషన్లో ఉన్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ముగ్గురు పిల్లలు అని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు.. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంగా ఉన్న లేక్ వాల్దైకు సమీపంలోని ఓ ఎస్టేట్‌లో ఉంటున్నట్టు రష్యన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ సైట్ ‘ది ప్రాజెక్ట్’ పేర్కొంది.
120 మిలియన్ డాలర్లు వెచ్చించి, ఈ ఎస్టేట్‌ను రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు పుతిన్. నిర్మాణ పనులు 2020లో మొదలై.. రెండేళ్లల్లో ముగిశాయి.
ఆ తర్వాత, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పుతిన్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఎస్టేట్.. 13వేల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు.
గతంలో బయటకొచ్చిన ఫొటోల ప్రకారం ఈ ఎస్టేట్‌లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, టేబుల్స్ వంటి వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది.
ప్యాలెస్‌లో అలినా కబేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది.
ఈ నిధుల నుంచి అలినాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది.
పుతిన్, అలినాలు కలిసి ఉండటం తాము ఎప్పుడు చూడలేదని పలువురు అధికారులు పేర్కొన్నా.. అలా అని వారిద్దరు రిలేషన్లో లేరని కాదని వివరించారు.
పుతిన్ అండతో రాజకీయాల్లోకి
పుతిన్ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనాకు ..2014లో రష్యా జాతీయ మీడియా బృందం బాధ్యతలను అప్పగించారు పుతిన్.
అప్పటి నుంచి ఆమె ప్రతియేటా 8.6 మిలియన్ యూరోలు జీతంగా అందుకుంటున్నారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరించారు.
నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ బోర్డు ఛైర్ పర్సన్ గా పనిచేశారు.
వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి, ప్రస్తుతం జైలులో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీ బృందం.. 2021లో తొలిసారి ఈ ఎస్టేట్ వివరాలను బయటపెట్టింది.
బడ్జెట్ నిధులను దొంగలించి, ఈ ఎస్టేట్‌కు నిర్మించారని నావెల్నీ బృందం ఆరోపించింది.