Last Updated:

Realme GT 3: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లాంచ్.. మీరు ఓ లుక్కేయండి

నిత్య జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఓ భాగంగా అయిపోయింది. ఫోన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జింగ్ సమస్య వెంటాడుతోంది. మీ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా..

Realme GT 3: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లాంచ్.. మీరు ఓ లుక్కేయండి

Realme GT 3: నిత్య జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఓ భాగంగా అయిపోయింది. ఫోన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జింగ్ సమస్య వెంటాడుతోంది. మీ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా.. అయితే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘రియల్ మీ’ వేగంగా ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.

రియల్ మీ జీటీ 3 పేరుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ ను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2023లో సంస్థ లాంచ్‌ చేసింది.

240W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తున్న ప్రపంచంలోనే తొలి ఫోన్‌ ఇదేనని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లో 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చు. జీటీ 3 ఫోన్ ధర, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

ధర ఎంతంటే..(Realme GT 3)

రియల్‌మీ జీటీ 3 ఐదు వేరియంట్లలో వస్తోంది. 8 జీబీ+128 జీబీ, 12 జీబీ+256 జీబీ, 16 జీబీ+256 జీబీ, 16 జీబీ+ 512 జీబీ, 16 జీబీ+1టీబీ వేరియంట్లో వస్తోంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు.

ఈ ఫోన్ బేస్‌ వేరియంట్‌ ధర భారత మార్కెట్లో రూ. 53,500 నుంచి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. అమ్మకాలు కూడా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేదీ కంపెనీ తెలపలేదు.

గత ఏడాది ఏప్రిల్‌లో రియల్‌ మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది.

 

స్పెసిఫికేషన్స్‌

రియల్‌మీ జీటీ3 స్పెసిఫికేషన్స్‌ చూస్తే.. ఆండ్రాయిడ్‌ 13 తో రియల్‌ మీ యూఐ 4.0 తో వస్తోంది. 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్‌, 144Hz రీఫ్రెషర్‌ రేటు కలిగిన డిస్‌ప్లే అమర్చారు.

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జనరేషన్‌ ప్రాసెసర్‌ ను ఇందులో వినియోగించారు.

వెనుక వైపు 50 MP సోనీ ఐఎంఎక్స్ ‌890 సెన్సర్‌, 8 MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 MP మైక్రో సెన్సర్‌ అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 Mp కెమెరాను అమర్చారు.

 

ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్‌ తో

ఈ ఫోన్‌లో రెండు బెస్ట్ ఫీచన్స్ ను కంపెనీ అందిస్తోంది. ఒకటి ఫాస్ట్‌ ఛార్జింగ్‌.. రెండోది ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్‌. ఇందులో 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు.

ఈ ఫోన్‌ 240W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

దీని ద్వారా తొలి 50 శాతం బ్యాటరీని కేవలం నాలుగు నిమిషాల్లో, ఫుల్‌ బ్యాటరీని 9.3 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.

ఇక వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్‌ 25 రంగులు వెలువరిస్తుంది. కాల్స్‌, మెసేజ్ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్‌ వస్తుంది.

యూజర్‌ తనకు నచ్చినట్లుగా మార్చుకునేందకు వీలు ఉంటుంది.