Vinayaka Chavithi: పూజ సామాగ్రి ధరలు పెంచిన చిరు వ్యాపారులు
వినాయకచవితి పండుగ పూజలు మొదలయ్యాయి.మామూలుగా పండగలు పూలతో స్వామి వారిని అలకంరించి పూజలు చేస్తాము అలాగే పండ్లను కూడా దేవుడు దగ్గర పెడతాము కానీ ఇప్పుడు పూలు,పండ్లు కొందామని మార్కెటుకు వెళ్తే అక్కడ రేట్లు చూస్తే భగ్గుమంటున్నాయి.
Vinayaka Chavithi :వినాయకచవితి పండుగ పూజలు మొదలయ్యాయి. మామూలుగా పండగలు పూలతో స్వామి వారిని అలకంరించి పూజలు చేస్తాము. అలాగే పండ్లను కూడా దేవుడు దగ్గర పెడతాము కానీ ఇప్పుడు పూలు, పండ్లు కొందామని మార్కెటుకు వెళ్తే అక్కడ రేట్లు చూస్తే భగ్గుమంటున్నాయి. ఇదే మార్కెట్ వాళ్ళకి మంచి గిరాకి కాబట్టి దాని వల్ల మార్కెట్ వ్యాపారులు ఇదే అదనుగా పూలు, పండ్లకు రేట్లు పెంచేశారు. మనం పూజ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా పూలు పండ్లు కావాలిసిందే అవి లేకుండా పూజ చేయలేము.
మనం పూజ చేసేటప్పుడు పూలు, పండ్లకు మాత్రమే కాకుండా పూజ సామాగ్రి, మండపాలు, డెకరేషన్ వస్తువులు కూడా మనకి కావాలి. ఇప్పుడు వ్యాపారులు పూజ సామాగ్రి, మండపాలకు కూడా భారీ ధరలు పలుకుతున్నాయి. మార్కెటుకు ఏది కొందామని వెళ్ళిన ధరలు చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవ్వాలిసిందే. ఇప్పుడు బయట పరిస్థితలు ఇలాగే ఉన్నాయి.
వినాయక చవితి పండుగ సమయంలోనే చిరు వ్యాపారులు నాలుగు రాళ్ళు సంపాదించుకుంటారు. కొన్ని రోజుల నుంచే వినాయకుడు విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చిన్న విగ్రహాలు ధరలు వేలల్లో ఉన్నాయి. పెద్ద విగ్రహలు ఐతే ఇంకా ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఈ పండుగ సమయాన శుభవార్త ఏంటంటే గత రెండేళ్ల నుంచి భక్తులందరు ప్లాస్టిక్ విగ్రహాలకు బై చెప్పి మట్టి విగ్రహాలకు వెల్కమ్ చెబుతున్నారు. దీని బట్టి చూసుకుంటే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. వినాయకుడి విగ్రహాలు ఎంత రేటు పలికిన భక్తులు కొనడానికి రెడీగా ఉంటున్నారు. మనం ఇలాగే మట్టి విగ్రహాలతో పూజలు చేస్తే, ప్రకృతికి కూడా మేలు చేసిన వాళ్ళంమౌతాం.