Last Updated:

Valentains Day: ప్రేమికుల రోజు ఎలా మొదలైంది? అసలు వాలెంటైన్ ఎవరు?

Valentains Day: రెండు మనసుల్ని.. దగ్గర చేసేదే ప్రేమ. దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమలో ఉన్నా కూడా.. వారికి ఈ రోజు మాత్రం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. తమ ప్రేమను వ్యక్త పరచడానికి దీనికి మించిన రోజు మరోకటి ఉండదని భావిస్తారు.

Valentains Day: ప్రేమికుల రోజు ఎలా మొదలైంది? అసలు వాలెంటైన్ ఎవరు?

Valentains Day: రెండు మనసుల్ని.. దగ్గర చేసేదే ప్రేమ. దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమలో ఉన్నా కూడా.. వారికి ఈ రోజు మాత్రం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. తమ ప్రేమను వ్యక్త పరచడానికి దీనికి మించిన రోజు మరోకటి ఉండదని భావిస్తారు. అందుకే ఈ రోజును ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటారు. వారు ఇష్టపడిన వ్యక్తికి ప్రపోజ్ చేస్తారు. మరి ఈ వాలెంటైన్స్ డే ఎలా పుట్టింది. ఈ రోజే దానిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాలెంటైన్ డే అంటే ఏంటి..? సెయింట్ వాలెంటైన్ ఎవరు? (Valentains Day)

వాలెంటైన్స్ డేకి చాలా చరిత్ర ఉంది. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లుపర్‌కాలియా అనే వేడుక చేసుకునేవారు. ఈ వేడుకల్లో వారు.. ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఓ బాక్సులో వేసేవారు. ఆ తర్వాత అబ్బాయిలు ఆ బాక్సులోంచి చీటీసు తీసేవారు. అందులో ఏ అమ్మాయి పేరు వస్తుందో ఆ వేడుకలో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలా ఇద్దరు కలిసి ఆ వేడుకలో పాల్గొనేవారు. ఇలాంటి జంటలు.. కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునేవారు. ఈ సంప్రదాయం నుంచే వాలెంటైన్స్ డే వచ్చిందని భావిస్తున్నారు. సెయింట్ వాలెంటైన్ ఒక కైస్తవ ప్రవక్త. ఆ కాలంలో.. రోమ్ ని పాలించే.. క్లాడియస్ అనే చక్రవర్తితన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు.

వాలెంటైన్‌ను ఎందుకు చంపేశారు?

మగవాళ్ల పెళ్లిళ్ల నిషేధంపై.. వాలెంటైన్ ధిక్కరించారు. మగవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవద్దన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వాలెంటైన్‌కు నచ్చలేదు. దీంతో రోమ్ చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి.. వాలెంటైన్‌ కి మరణశిక్ష విధించారు. వాలెంటైన్ జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డారు. కానీ ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేశారు. మరణశిక్షకు ముందు.. వాలెంటైన్ జైలర్ కుమార్తెకు లవ్ లెటర్ రాశారు.

ఫిబ్రవరి 14నే ఎందుకు..?

చక్రవర్తి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్ కు ఉరిశిక్ష అమలు చేశారు. ఇదే రోజున ఆయన చనిపోవడంతో.. దానికి గుర్తుగా ఈ వాలెంటైన్ డే ని జరుపుకోవాలని వారు నిర్ణయించారు. అప్పటి నుంచి తమ ప్రేమని వ్యక్తం చేయడానికి ప్రజలు సెయింట్ వాలెంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు. కాలనుగుణంగా అది వాలెంటైన్స్ డే గా స్థిరపడిపోయింది. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తొలిసారిగా 496 సంవత్సరంలో జరుపుకున్నారని చెబుతారు.

కొన్ని దేశాల్లో నిషేధం..

ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో ఈ రోజుని నిషేధించారు. పాకిస్థాన్ లో ప్రేమికుల రోజుపై నిషేధం ఉంది.ఇక సౌదీ అరేబియా కూడా వాలెంటైన్ ని నిషేధించింది. ప్రేమికుల రోజు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని వారించింది. ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత ఉంది.