Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి నాలుగేళ్లు.. సైనికుల త్యాగాన్ని మర్చిపోం
Pulwama Attack: ఫిబ్రవరి 14 2019 అది. రక్తపాతం.. ఛిద్రమైన సైనికుల శరీర భాగాలు.. కాలిపోయిన మృతదేహాలు. భరతమాత కంటినిండా నీరు. భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచింది జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 40 మంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
Pulwama Attack: ఫిబ్రవరి 14 2019 అది. రక్తపాతం.. ఛిద్రమైన సైనికుల శరీర భాగాలు.. కాలిపోయిన మృతదేహాలు. భరతమాత కంటినిండా నీరు. భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచింది జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 40 మంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేశ రక్షణ కోసం.. విధులకు వెళ్తున్న సమయంలో ఈ అత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనగర్ లో జరిగిన దాడికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి.
దేశవ్యాప్తంగా విషాదఛాయలు.. (Pulwama Attack)
ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఆ రోజు జరిగిన ఘటనతో.. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఆ అమరవీరులను స్మరించుకుంటూ దేశం వారికి నివాళులర్పిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన అమరజవాన్ల సేవలను దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ సందర్భంగా దేశ ప్రజలు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. పుల్వామా దాడి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ క్రూరమైన దాడిని ఖండిస్తూ.. ప్రతి ఒక్కరూ సంతాపం తెలుపుతున్నారు. ఛిద్రమైన శరీర భాగాలు.. కాలిపోయిన మృతదేహాలకో మారణ హోమం జరిగింది. దాడి అనంతరం హృదయాన్ని కదిలించే దృశ్యాలు అందరిని కలిచివేశాయి.
ఈ దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ
ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వీడియోను విడుదల చేసింది. పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ దాడి తర్వాతి రోజు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను పాక్ ఖండించింది. ఈ దాడి అనంతరం అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.12 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ దాడి అనంతరం కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 26, 2019 న భారత వైమానిక దళం పాక్ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.
నివాళులు అర్పించిన మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ..
పుల్వామా ఉగ్రదాడి భారత్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 40మంది సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటా.. ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వారి అత్యున్నత త్యాగాన్ని దేశం.. ఎప్పటికీ మరచిపోలేదని ట్వీట్టర్ ద్వారా తెలిపారు. పుల్వామాలో మనం కోల్పోయిన వీరులను స్మరించుకుంటున్నాను. వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి వారి ధైర్యం మనల్ని ప్రేరేపిస్తుంది అని ట్వీట్ చేశారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం నివాళులర్పించారు. 2019లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. వారి పరాక్రమం, అలుపెరగని ధైర్యసాహసాలు ఉగ్రవాదంపై పోరులో ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని అమిత్ షా ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వీరి త్యాగాన్ని దేశం ఎన్నటికి మరిచిపోదని అన్నారు.