Bank Statement: ఇది మీ కోసమే.. ప్రతినెలా బ్యాంక్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోండి
Bank Statement: కొందరు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుంటారు. చాలా వరకు దాని స్టేట్ మెంట్ ను మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏదైనా అవసరం అయితే తప్పా.. స్టేట్ మెంట్ గురించి ఆరా తీయరు. కానీ ప్రతినెలా బ్యాంక్ స్టేట్ మెంట్ ని చెక్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.
Bank Statement: కొందరు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుంటారు. చాలా వరకు దాని స్టేట్ మెంట్ ను మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏదైనా అవసరం అయితే తప్పా.. స్టేట్ మెంట్ గురించి ఆరా తీయరు. కానీ ప్రతినెలా బ్యాంక్ స్టేట్ మెంట్ ని చెక్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక నిర్దిష్ట వ్యవధిలో జరిపే లావాదేవీల వివరాలను ఇది నమోదు చేస్తుంది. ఎప్పుడైనా మోసాలు జరిగితే.. స్టేట్ మెంట్ ద్వారా మనం గుర్తించవచ్చు. ఇవేగాక మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓ సారి అవేంటో తెలుసుకుందాం.
గందరగోళం ఉండదు..(Bank Statement)
పని ఒత్తిడిలో పడి చాలామంది.. బ్యాంక్ స్టేట్ మెంట్ ను పెద్దగా పట్టించుకోరు. మరికొంత మంది చాలా హడావుడిగా ఖర్చు చేసేస్తారు. ఆ తర్వాత దానిని మర్చిపోతారు. నగదు ఎలా ఖర్చు పెట్టామో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటపుడు ఇది ఉపయోగపడుతుంది. నగదులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రతినెలా స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవడం మంచింది. పైగా ముఖ్యమైన లావాదేవీల పక్కన నోట్ రాసుకొని పెట్టుకోవడం మరింత సురక్షితం. మరోవైపు కొన్నిసార్లు బ్యాంకులు మనకు తెలియకుండానే.. అనేక ఛార్జీలను వసూలు చేస్తాయి. అలాంటివి తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూ వల్ల.. రెండు సార్లు ఛార్జీని విధిస్తాయి. అలాంటి వాటిని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగకరం. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వంటి వివరాలు స్టేట్‌మెంట్‌లో ఉంటాయి.
మోసాలను నివారించవచ్చు..
ఈ మధ్య కాలంలో.. బ్యాంకుల పేరు చెప్పి మోసాలు ఎక్కువ చేస్తున్నారు. అలాంటి వాటిని నిరూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉపయోగపడుతుంది. ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగితే.. దాన్ని స్టేట్‌మెంట్‌లో గుర్తించవచ్చు. ఆపై సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాకా.. స్టేట్ మెంట్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఖాతాలో ఎంత డబ్బుందో చూడకుండానే ఖర్చు చేస్తున్నాం. ఇలాంటి వాటిని నియంత్రించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవడం మంచిది. ఎక్కడైనా అనవసర ఖర్చు చేసినట్లు గుర్తిస్తే.. వాటిని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.
పెట్టుబడిగా మిగులు నిధులు..
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా.. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఖాతాలో ఎంతో కొంత నగదును జమ చేస్తున్నారు. ఇలా మిగిలిన ఖాతాల్లో డబ్బు అలానే ఉండిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలి. ఏ ఖాతాలో ఎంత నగదు ఉందో ఓ అవగాహన ఉంటుంది. ఏమైనా మిగులు నిధులు ఉన్నట్లు గమనిస్తే వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్రతినెలా ఇలా చేయడం ద్వారా.. ఖాతాపై అవగాహన ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు చెక్ చేసుకోవాలి. అనుమానం వస్తే.. సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించాలి.