Last Updated:

Amanchi Srinivasulu In Janasena Flex : వైసీపీకి ఊహించని షాక్.. జనసేన ఫ్లెక్సీలో ఆమంచి శ్రీనివాసులు..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజాల్లో పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుందని అనిపిస్తుంది.

Amanchi Srinivasulu In Janasena Flex : వైసీపీకి ఊహించని షాక్.. జనసేన ఫ్లెక్సీలో ఆమంచి శ్రీనివాసులు..?

Amanchi Srinivasulu In Janasena Flex : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు దూసుకుపోతున్నాయి.

ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజాల్లో పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుందని అనిపిస్తుంది.

ఇప్పుడు తాజాగా వైసీపీ బాధ్యుడుగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫోటో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మీద ఉండడం చర్చనీయాంశంగా మారింది.

 

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చీరాలలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు ఫోటోలను కూడా ముద్రించారు. దీంతో ఈ ఫ్లెక్సీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

(Amanchi Srinivasulu In Janasena Flex)అన్నదమ్ముల మధ్య పోటీ తప్పదా..?

చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి శ్రీనివాసరావు. అంతేకాదు ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున అతని సోదరుని ఫోటో కూడా ఫ్లెక్సీలో ఉండడంతో.. ఆమంచి శ్రీనివాసరావు జనసేనలోకి మారతారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఆమంచి స్వాములు గత రెండేళ్లుగా పర్చూరు వైసీపీ సీటు కోసం ఆశిస్తున్నారు. అయితే ఇటీవల జగన్ పర్చూరు బాధ్యతలను ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంటుందా అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి?

ఇటీవల కాలంలో వైసీపీ సొంత నేతలే ప్రభుత్వంపై రివర్స్ అవ్వడం వారి వైఫల్యాన్ని కనబరుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని స్వయంగా బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇలా అరెస్టుల పరంపరను కొనసాగిస్తున్న ఈడీ ఈ కేసు దర్యాప్తులో దూకుడుమీదున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవను ఈరోజు మధ్యాహ్నాం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది.అనంతరం విచారణ కోసం కస్టడీలోకి తీసుకోనుంది. ఈ పరిస్థితులు అన్నింటినీ చూస్తుంటే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో గడ్డు కాలం తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/