Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా OG పూజ కార్యక్రమం షురూ
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #OG పూజ కార్యక్రమం తాజాగా పూజ కార్యక్రమలు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #OG పూజ కార్యక్రమం తాజాగా పూజ కార్యక్రమలు జరుగుతున్నాయి.
యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది.
డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి.
ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..
పవన్ ఫ్యాన్ అయిన సుజిత్ డైరెక్ట్ చెయ్యనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
ఆ అంచనాలకి తగ్గట్లే ‘ది ఓజీ’ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్‌స్టర్‌లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి. ఓజీ పేరుతో
గ్యాంగ్ ఉంది అంటే.. అది చిన్నా చితకా గ్యాంగ్ కాదన్నమాట. ఇక ఆ గ్యాంగ్‌ను ప్రారంభించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గురించి చెప్పాల్సిన పనేముంది. తోపు అయితేనేకదా ఓజీ అయ్యేది.
అలాంటి ఒక ఓజీ కథే ఈ సినిమా. అలాంటి ఓజీగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడంటే.. ఇక నట విశ్వరూపమే.
పైగా, ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఇందులో గన్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా ఇష్టంగా నటించే అవకాశాలూ ఉన్నాయి.
(Pawan Kalyan OG) కథ ఎక్కడ జరుగుతుందంటే..
ఓజీ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ షాడో కనిపిస్తుంది. ఆ షాడో ఒక గన్‌లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఆ ఫొటోపై జపానీస్ భాష రాసి ఉంది.
పోస్టర్‌లో జపానీస్ భాషలో రాసి ఉన్న ఆ అక్షరాల అర్థం అగ్నితుఫాన్ అని.
అందుకే #FireStormIsComing అనే హ్యాష్‌ట్యాగ్ గత కొన్ని రోజులుగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నీడలో గన్ కనిపిస్తుంది. పవన్ ముందు ఉన్న వృత్తాకారం, ఎరుపు రంగు జపాన్ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.
అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తోంది. అది జపాన్ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.
ఇకపోతే పోస్టర్‌లో మరోవైపు ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది.
దీనిని బట్టి ఈ సినిమా కథ జపాన్, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో కల్ట్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టింది.
కమల్ హాసన్ విక్రమ్, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి.. ఈ సినిమాల డైరెక్టర్లు అందరూ ఆ హీరోలకు వీరాభిమానులు.
ట్విటర్‌లో ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతోంది. తమ అభిమాన హీరోకి మళ్లీ మునుపటి వైభవం తీసుకురావడానికి అభిమానులే దర్శకులుగా వస్తారని ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌కు ఇది సరిపోతుందా లేదా అనేది పక్కనపెడితే.. సుజిత్ మాత్రం పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఒకప్పుడు థియేటర్లకు వెళ్లి, ఎర్ర కండువా తలకు కట్టుకుని మరీ జై పవర్ స్టార్ అని నినాదాలు చేసిన కల్ట్ ఫ్యాన్.
అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి.. ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/