Last Updated:

Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌, సీఎం జగన్

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌, సీఎం జగన్

Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం శకటాల ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్, సీఎం తిలకించారు.

ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్‌ను సీఎం జగన్ తో కలిసి పరిశీలించారు.

కాగా ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌  విశ్వభూషణ్‌ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

 

(Republic Day) దేశ అభ్యున్న‌తికి కృషి చేద్దాం అంటున్న సీఎం జగన్..

అలానే ట్విట్టర్ వేదికగా కూడా సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో .. స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్భంగా ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు మ‌న రాజ్యాంగక‌ర్త‌ల‌ను స్మ‌రించుకుంటూ వారి బాటలో న‌డిచి దేశ అభ్యున్న‌తికి కృషి చేద్దాం అంటూ రాసుకొచ్చారు.

 

గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు  తెలియజేశారు.  ‘‘74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలను తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవం ఆ గొప్ప దేశభక్తులందరి సంస్మరణ దినం. వారి త్యాగాల వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛా ఫలాలను అనుభవించడం సాధ్యమైంది. ఇది సత్యం, అహింస, శాంతి, ఐకమత్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వం ఉదాత్తమైన ఆదర్శాలకు పున: అంకితం చేసే రోజు.. అవననీ స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటాన్ని ప్రేరేపించాయి. ఈ రోజును నిజంగా గుర్తుండిపోయేలా చేయడానికి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/