Pawan Kalyan: తెలంగాణలో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దం.. ప్రకటించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేనాని ఛలో కొండగట్టు లో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు.
అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు.
తెలంగాణలోనూ జనసేన పోటీ
భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు.
తెలంగాణ కళాకారుల రగిలించిన చైతన్యమే తన పోరాటానికి స్ఫూర్తి అని పవన్ అన్నారు.
తుది శ్వాస వరకు తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ లో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని వవన్ కళ్యాణ్ ప్రకటించారు.
రాష్ట్ర సమసల్యపై లోతైన అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గంలో తాను పర్యటిస్తానని చెప్పారు.
ఈ మేరకు తెలంగాణలోనూ ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ పొత్తు ఉండదని..కానీ జనసేన మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు.
పరిమిత సంఖ్యలో పోటీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం చూపాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎవరితో పోటీ పెట్టుకున్నా జీహెచ్ఎంసీ ఎన్నికలు వదిలేసినట్టు వదలమని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో తాను లేనని.. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి స్పూర్తిని పొందుతానన్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమస్యలు వేర్వేరని.. రెండు రాష్ట్రాలను పోల్చి చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను ఏదైనా సాధించాను అంటే.. అది తెలంగాణ ఇచ్చే స్పూర్తే అన్నారు.
ఏపీలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాలని.. అది తనకు చాలా కష్టమన్నారు.
ఏపీలో ఉన్న నాయకులు మామూలు వాళ్లు కారని .. సొంత బాబాయ్ నే చంపుకున్న వాళ్లని ఎద్దేవా చేశారు.
న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలను ఇష్టం ఉన్నట్టు వాడేవాళ్లు ఏపీలో ఉన్నారని.. ప్రజా స్వామ్యం అనే పదానికి అక్కడ విలువ లేదన్నారు.
కానీ ఏపీ లో ఉండే నాయకత్వం.. తెలంగాణలో లేదన్నారు. తాను తెలంగాణ గడ్డ పోరాటాలను పునికిపుచ్చు కున్నాను కాబట్టే.. ఏపీలో చెప్పుతో కొడతాను అన్నానని పవన్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలను చూడాలని కోరుకుంటానని ఆయన అన్నారు.
ధర్మపురిలో పవన్ ప్రత్యేక పూజలు
నాచుపల్లిలో పార్టీ నేతల సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టునున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.
పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టు, ధర్మపురి పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జనసేన పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి ని ప్రారంభించారు.
కొండగట్టులో పవన్ పర్యటన సందర్భంగా ఆయన చూసేందుకు అభిమానులు , జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
అభిమానులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు. ఆ సందర్భంగా ఓపెన్ టాప్ వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/