Last Updated:

AIFF: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం తొలగింపు

మేలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సీఓఏను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేయడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తివేసింది. దీనితో అక్టోబర్‌లో జరిగే మహిళల U-17 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి అడ్డంకులు తొలగిపోయాయి.

AIFF: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై  నిషేధం తొలగింపు

AIFF: మేలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సీఓఏను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేయడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తివేసింది. దీనితో అక్టోబర్‌లో జరిగే మహిళల U-17 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి అడ్డంకులు తొలగిపోయాయి.

ఎఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ) సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని బ్యూరో ఆఫ్ కౌన్సిల్ ఆగస్టు 25న నిర్ణయించింది. అక్టోబర్ 11-30 తేదీల్లో జరగాల్సిన ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో నిర్వహించబడుతుందిని ఫిఫా ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవలసిన తదుపరి చర్యలకు సంబంధించి త్వరలో ఎఐఎఫ్ఎఫ్ కు మరింత సమాచారం అందించబడుతుంది. ఫిఫా మరియు ఎఎఫ్ సి పర్యవేక్షణ కొనసాగుతుంది .ఇవి ఎఐఎఫ్ఎఫ్ తన ఎన్నికలను సకాలంలో నిర్వహించడంలో మద్దతునిస్తాయి.

ఇవి కూడా చదవండి: