Ind vs Nz 1st ODI: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై టీం ఇండియా ఘనవిజయం
చివరి వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు
Ind vs Nz 1st ODI: చివరి వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది.
భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 337 పరుగులకు కట్టడి చేసి విజయం సాధించారు.
ఒంటరి పోరాటం చేసిన మిచెల్ బ్రేస్‌వెల్..
అయితే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ టీమిండియాపై ఒంటరి పోరాటం చేశాడు.
78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేసి 140 పరుగులు చేశాడు.
ఒకానొక దశలో న్యూజిలాండ్ గెలుపు ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు.
కానీ చివరిలో 49 వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ చేసి కైవసం చేసుకొని న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.
ఇక చివరి ఓవర్ లో కూడా వికెట్ సాధించి ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
భారత బౌలర్లలో సిరాజ్ మరోసారి అదరగొట్టాడు.
సిరాజ్ తన హోంగ్రౌండ్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు సాధించారు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్..
అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది.
ఈ మ్యాచ్(Ind vs Nz 1st ODI)లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ( 149 బంతుల్లో 208 పరుగులు, 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు.
కోహ్లీ(8), ఇషాన్ కిషన్ (5), నిరాశపర్చారు. రోహిత్ శర్మ (34), సూర్య కుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు.
బ్రేస్‌వెల్, శాంట్నర్ ఏడో వికెట్‌కు సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మరి వచ్చే మ్యాచులలోనూ ఇదే జోరు కొనసాగించి ఈ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంటుందా లేదా అనే వేచి చూడాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/