Ind vs Nz: నేడు తొలి వన్డే.. ఉప్పల్‌లో కివీల వేట!
Ind vs Nz: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో న్యూజిలాండ్ తో భారత్ నేడు తలపడనుంది. గత సిరీస్ లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. కివీస్ తో సవాలుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్ కు ముందు ఈ సిరీస్ కీలకం కానుంది.
ప్రపంచకప్ కు ముందు.. సొంత గడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ లను ఆడనుంది. శ్రీలంకపై సిరీస్ సొంతం చేసుకున్న ఇండియాకు ఇపుడు న్యూజిలాండ్ సవాలుగా మారింది. దీని తర్వాతే ఆస్ట్రేలియాతో సిరీస్ ఉన్నాయి. ఈ రెండు సిరీస్ లు భారత్ కు కీలకం కానున్నాయి. కొద్ది సంవత్సరాలుగా అగ్రశ్రేణి జట్టుగా ఉన్న కివీస్ తో సిరీస్ భారత్ క్ అతిపెద్ద పరీక్షగా నిలవనుంది. ప్రపంచకప్ జట్టు కూర్పుపై దృష్టిసారించిన రోహిత్ కు.. ఈ సిరీస్ చక్కటి సన్నాహం అవుతుందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు.
వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో రన్నరప్‌గా నిలిచిన కీవిస్ తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఉప్పల్ స్టేడియంలో నేడు తొలి వన్డే జరగనుంది. గత సిరీస్ లో విరాట్ కోహ్లి శతకాలు.. శుభ్‌మన్ గిల్ సెంచరీ భారత్ కలిసొచ్చే అంశాలు.
ఇక బౌలింగ్ లో సిరాజ్ పదునైన పేస్.. కుల్ దీప్ స్పిన్ బౌలింగ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి.
ఇక పాకిస్థాన్‌ను వారి గడ్డపై కివీస్ 2-1తో ఓడించి.. మంచి ఫామ్ లో ఉంది. కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోయినా లేథమ్ టీమ్ ను నడిపిస్తున్నారు.
కివీస్ స్టార్ ఆటగాళ్లు విలియమ్సన్, సౌథీ లేకపోయినా ఆ జట్టు పటిష్టంగానే కనిపిస్తుంది.
పాక్‌పై వన్డే సిరీస్ విజయంతో కివీస్ భారత్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్ లేథమ్, ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్‌ల బ్యాటింగ్ కివీస్‌కు బలం.
కీవిస్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది.
తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ (వికెట్ కీపర్), హార్దిక్, సుందర్, చాహల్/కుల్‌దీప్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్‌మన్/నికోల్స్, మిచెల్, లేథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, మైకేల్ బ్రాస్‌వెల్, శాంట్నర్, షిప్లీ, ఫెర్గూసన్, డఫీ.
పిచ్
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20కి ఉపయోగించిన పిచ్ నే నేడు ఉపయోగిస్తున్నారు. ఆ మ్యాచ్ లో కోహ్లి, సూర్య భారత్ కు విజయాన్ని అందించారు.
నేడు కూడా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని తెలుస్తుంది.
ఇప్పటివరకు ఉప్పల్ లో భారత్ 6 మ్యాచులు ఆడగా.. అందులో మూడు గెలిచి మరో మూడు మ్యాచులు ఓడిపోయింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/