IND vs NZ ODI: ఉప్పల్ మ్యాచ్ కు హై సెక్యూరిటీ.. ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు
IND vs NZ ODI: భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్(IND vs NZ ODI) కోసం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్దమైంది.
ఇరుజట్ల మధ్య రేపు (జనవరి 18) జరిగే మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు.
ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు
మ్యాచ్ టికెట్స్, బీసీసీఐ పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియంలోకి రావాలని కోరారు. గ్రౌండ్ లోకి వెళ్లి ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామని.. మహిళల కోసం 40 మందితో షీటీమ్స్ నిఘా ఉంటుందని తెలిపారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్లపై ప్రత్యేక ద్రుష్టి పెట్టామని చౌహాన్ చెప్పారు. బ్లాక్ టికెటింగ్ పై ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయ్యాయన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ప్రేక్షకులు ఎక్కువ వస్తారని అంచనా వేస్తున్నామని.. దానికి తగ్గట్టు రిజర్వ్ బందోబస్తు అందుబాటులో ఉంటుందన్నారు.
గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంది స్పష్టం చేశారు. ప్రతి గేట్ దగ్గర సీఐ ఆధర్యంలో భద్రత ఉంటుందని వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెల్ ఫోన్ తప్ప మిగిలిన వస్తువులను స్టేడియం అనుమతించమన్నారు.
ఉప్పల్ వేదికగా జరుగనున్న మ్యాచ్ కు సుమారు 40 వేల మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంది.
అందుకోసం హెచ్ సీఏ అన్నీ ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/