Janasena Yuvashakthi: వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
Janasena Yuvashakthi: రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందని.. వైసీపీ నాయకులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జనసేన నాయుకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రతిపక్షా నాయకులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో అరాచక పాలన
రాష్ట్రంలో వైసీపీ రహిత పాలనే తమ లక్ష్యమని.. సుపారిపాలనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ఇక ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా యువత, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా యువతకు భరోసా కల్పించడం.. ప్రజల్లో జనసేన పై నమ్మకాన్ని పెంచేందుకే నిర్వహిస్తున్నామని తెలిపారు.
వైసీపీ దుర్మార్గ పాలనకు జన సైనికులు అధైర్యపడవద్దని.. జన సైనికుల్లో నమ్మకం నింపేందుకే ఈ సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ యోచించారని మనోహర్ అన్నారు.
జనసేన పార్టీ కొంత మంది వ్యక్తుల కోసమో.. లేదా కొన్ని ప్రాంతాల ప్రయోజనం కోసమో కాదని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకే పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించారని అన్నారు.
మన బిడ్డల భవిష్యత్ కోసమే ఈ పార్టీ ఉంటుందని.. పేదలకు అండగా పవన్ కళ్యాణ్ ఉంటారని అన్నారు.
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి అని.. మాట తప్పని వెన్ను చూపని గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నాదెండ్ల అన్నారు.
యువతకు అండగా జనసేన
రాష్ట్రంలో ప్రశ్నించే యువతను.. కేసులతో, దాడులతో వైసీపీ నేతలు భయపెడుతున్నారని.. అలాంటి వారికి పవన్ భయపడే వ్యక్తి కాదని అన్నారు. టిట్లి తుఫాన్ సమయంలో ఈ ప్రాంతం వైపు జగన్ కన్నెత్తి చూడలేదని.. ఇక్కడి ప్రజలను పవన్ కళ్యాణ్ ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు.
వైసీపీ నేతలకు జనసేనను విమర్శించడం మాత్రమే తప్పా.. రాష్ట్రాభివృద్ది పట్టదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగం తీవ్రస్తాయిలో ఉందని.. దాని గురించి సీఎం ఏనాడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అత్యంత దయనీయ స్థితిలో యువత ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అలాంటి పరిస్థితి యువతకు రాకుడదనే పవన్ కళ్యాణ్ సంకల్పిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. వైసీపీ నేతలకు ఈ ప్రాంతంపై చిత్తశుద్ది ఉంటే ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. నిజాయితీగా రాష్ట్రంలో జనసేన పార్టీ పని చేస్తుందని.. యువత ఈ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని మనోహర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1
Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు
Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/