Last Updated:

KTR : సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ… ఆ విషయాలు మాట్లాడుకున్నామని ట్వీట్

ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని పేర్కొన్నారు.

KTR : సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ… ఆ విషయాలు మాట్లాడుకున్నామని ట్వీట్

KTR : ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాం అని కేటీఆర్ ట్విట్టర్‎లో వెల్లడించారు.

సత్య నాదేళ్ల తన భారత్ టూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని మెచ్చకున్నారు. ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వివరాలు సత్యనాదెళ్ల పోస్ట్ చేశారు.. థ్యాంక్యూ నరేంద్ర మోదీ జీ. కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణ మద్ధతుతో నిలకడతో కూడిన ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చాలా శ్రద్ధ చూపుతుంది. ఇది స్పూర్తి దాయకం. డిజిటల్ ఇండియా విజన్ తో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ మారే కలను సాకారం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ సాయపడుతుందని అన్నారు.

త‌ర్వాత బెంగుళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన్నారు. ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ‘చాట్‌ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఛాట్‌ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. ఆ రోబోతో ఆయ‌న మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని ఆయన చాట్‌ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని తనను అవమానించొద్దని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: