Minister Mallareddy: ఏపీలో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. మంత్రి మల్లారెడ్డి
2024లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .
Minister Mallareddy: 2024లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .మంత్రి మల్లారెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. . తెలంగాణలో 8 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ది పనులను చూసి.. ఏపీలోని ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అన్నింటినీ కేసీఆర్ పూర్తి చేస్తారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము ధైర్యం ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు చేయడం లేదన్నారు. మరోవైపు కేసీఆర్ సమక్షంలో ఈరోజు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరనున్నారు.