Last Updated:

Kandukur Incident : కందుకూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ…ఏమన్నారంటే ?

Kandukur Incident : కందుకూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ…ఏమన్నారంటే ?

Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మృతులకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను ఎనిమిది అంబులెన్స్‌ల ద్వారా స్వస్థలాలకు తరలించనున్నారు. మృతులకు టీడీపీ తరపున అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కందుకూరులోనే చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.

కాగా మరోవైపు చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి కొడాలి నాని … ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో సభ నిర్వహించారు చంద్రబాబు. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారు. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: