YSR Congress party: ఏడాదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం ఎంత తగ్గిందంటే..?
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గింది.
YSR Congress party: ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. వైఎస్ఆర్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ సీపీకి రూ.93.72 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు అదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే సుమారు 13.21 శాతం తరుగుదల కనిపించినట్లయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2021లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.96.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ సొమ్ము ఈ సారి రూ.60 కోట్లే వచ్చింది. అన్ని ఖర్చులుపోగా పార్టీకి నికరంగా రూ.92.72 కోట్ల ఆదాయం మిగిలిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంనాటికి ఉన్న రూ.250 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో కలిపితే 2022 మార్చి 31నాటికి పార్టీ జనరల్ ఫండ్‌కు రూ.343 కోట్లు చేరింది.