Kodali Nani: వంగవీటి రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే.. చంద్రబాబు పాత్ర ఉంది.. కొడాలి నాని
వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు.
Kodali Nani: వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు. ఇటువంటి పరిస్దితి వచ్చేలా చేసింది రంగా గారి అభిమానులేనని ఆయన అన్నారు.దేవినేని నెహ్రూ అనే వాడు రంగాను చంపలేడు. రంగాగారిని చంపగలిగే వారు లేరు. నాటి టీడీపీ ప్రభుత్వం, మంత్రులు కలిసి చంపారు.రంగా హత్యలో చంద్రబాబు భాగమేనని ఆయన చేతిలోని వ్యవస్థలే హతమార్చాయని అన్నారు. రంగా హత్యకు కారకులైన ముసలి కబోతులు గాల్లో కలిసిపోయారు.మరికొందరు కలవడానికి సిద్దంగా వున్నారని అన్నారు. రావి వెంకటేశ్వరరావు, చంద్రబాబు కు ఏమాత్రం సిగ్గులేదని అందువల్లే గుడివాడలో రాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
రంగాకు పెరగుతున్న ఇమేజ్ ను చూసి తట్టుకోలేక ఆయనను హత్య చేసారు. రంగా ఎక్కడికి వెళ్లినా పోలీసుల తనిఖీలతో వేధించారు. తనకు రక్షణ కల్పించాలని రంగా దీక్షకు దిగితే ఆయనను హత్య చేయించారు. రంగా హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న వైజాగ్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, దేవినేని ఉమా, ఏ పార్టీలో ఉన్నారు? చలసాని పండు ఏ పార్టీలో ఉండేవాడు? డైరక్టుగా కోడెల శివప్రసాదరావు ఇన్ వాల్వ్ అయ్యాడు. ఈ విషయాన్ని చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. రంగా హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నవారు మా పార్టీలో ఎవరూ లేరు.రంగా గారు చనిపోయినపుడు జగన్మో్హన్ రెడ్డి, నేను స్కూళ్లకు వెడుతున్నాము. మామీద బురద జల్లాలని చూడకండని నాని అన్నారు.రంగా అభిమానులతో, వారి కుటుంబ సభ్యులతో నాకు సాన్నిహిత్యం ఉంది. అందుకే వారు నన్ను పిలుస్తారు. వారి అండతోనే నేను ఎమ్మెల్యేగా గెలిచానని రంగా పేర్కొన్నారు. నేను టీడీపీ లో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్ పీకాడు. ఇప్పుడు అదే టీడీపీ ఆయనకో్సం పాకులాడుతోందని నాని ఎద్దేవా చేసారు.
రంగా చనిపోయినపుడు గుడివాడలో రావి రావి వెంకటేశ్వరావు, రావి సింహాద్రి ఇళ్లను ఎందుకు ధ్వసం చేసారు? 1989లో ఇక్కడనుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని ఓడించారు. తరువాత ఇన్సూరెన్స్ డబ్బులు బాగా రాబట్టి బట్టల షాపు పెట్టి తమ షాపులో బట్టలు దొంగిలించారంటూ పేదలపై కేసులు పెట్టిన చరిత్ర రావి కుటుంబానిదని నాని ఆరోపించారు. 2004లో నేను టీడీపీ ఎమ్మెల్యేగా వున్నాను. వంగవీటి రాధా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ అతడిని పిలిచి రంగా గారి విగ్రహాలు పది పెట్టించాను. రావి వెంకటేశ్వరరావు ఎన్ని విగ్రహాలు పెట్టించాడు అని నాని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తులు నేడు రంగా కార్యక్రమాలు చేయడానికి సిద్దమయ్యారని అన్నారు. గుడివాడలో జరిగిన అల్లర్లపై ఒక వర్గానికి చెందిన మీడియా కావాలనే తప్పుడు కధనాలు ప్రసారం చేస్తోందని నాని ఆరోపించారు.