బిస్ట్: అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ కి ఒమన్ ఎంపీ రూ. 8.2 కోట్లు ఆఫర్… ఎందుకో తెలుసా?
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
Bisht: అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా ‘బిష్ట్’ ధరించి కనిపించాడు. ట్రోఫీని తీసుకునేముందు ఖతార్‌కు చెందిన ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దీనిని అతనికి అందించాడు. తాజాగా మెస్సీకి ఒమన్ న్యాయవాది మరియు పార్లమెంటు సభ్యుడు అహ్మద్ అల్ బర్వానీ అతను ధరించిన బిష్ట్ కోసం $1 మిలియన్ (రూ. 8.2 కోట్లు) ఆఫర్ చేశారు.
మిస్టర్ బర్వానీ ఈ ఆఫర్‌ను ట్విట్టర్లో షేర్ చేసి ఇలా వ్రాసాడు. 2022 ప్రపంచ కప్ ఖతార్ గెలిచినందుకు ఒమన్ సుల్తానేట్ నుండి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అరబిక్ బిష్ట్ శౌర్యం మరియు వివేకానికి చిహ్నం. ఆ బిష్ట్ కు నేను మీకు మిలియన్ డాలర్లను ఆఫర్ చేస్తున్నాను. ఈ సందర్బంగా బర్వానీ మీడియాతో మాట్లాడుతూ దీనిపై మెస్సీ చర్చలు జరపాలనుకుంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
మెస్సీకి బిష్ట్ ఇచ్చినప్పుడు నేను స్టేడియంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను” అని అల్ బర్వానీ అన్నారు. ఈ క్షణం మనం ఇక్కడ ఉన్నామని ప్రపంచానికి చెప్పింది. ఇది మన సంస్కృతి, దయచేసి దీన్ని బాగా తెలుసుకోండి. బిష్త్ జ్ఞానం, ధైర్యం, సమగ్రత, దాతృత్వం మరియు ప్రామాణికతకు చిహ్నం అని అల్ బర్వానీ పేర్కొన్నారు.