Last Updated:

JEE: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్‌‌కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే తాజాగా విడుదల చేసారు.

JEE: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

JEE Advanced Admit Card 2022: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్‌‌కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే తాజాగా విడుదల చేసారు. ఆగస్టు 28 వరకు హాల్‌ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వాళ్ళ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ షేడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్షను పేపర్-1, పేపర్-2 గా విభజించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయాన్ని కేటాయించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ మెయిన్ సెషన్-1 లో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చారు జేఈఈ మెయిన్ సెషన్-2 లో భారతీయ విద్యార్థుల ఫలితాల తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 12 వరకు కొనసాగింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: