తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. అక్రమ సంబంధమే కారణమా..?
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు.
Manchiryal Fire Accident: తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం మరింత విషాదకరం. అసలు ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది.. వారు ఎందుకు ఇంట్లోనే ఇరుక్కుపోవాల్సి వచ్చిందో ఓ సారి చూసేద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్లో శుక్రవారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రిస్తున్న సమయంలో శివయ్య, పద్మ దంపతులు ఓ పెంకుటిల్లులో నివాసం ఉంటున్నారు. అయితే వారితో పాటు గత కొద్దిరోజులుగా శాంతయ్య అనే శింగరేణి ఉద్యోగి కూడా నివాసం ఉంటున్నాడు. అంతే కాకుండా ప్రమాదం జరిగే ముందురోజు పద్మ అక్క కుమార్తె ఆమె ఇద్దరు పిల్లలో సహా ఆ ఇంటికి చేరుకున్నారు ఇలా మొత్తంగా ఆ రోజు ఆ ఇంట్లో 6మంది ఉన్నారు. అందరూ రాత్రి భోజనాలు పూర్తి చేసుకుని నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటిని మొత్తం ఒక్కసారిగా మంటలు భారీ స్థాయిలో చుట్టుముట్టడం వల్ల ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాలేకపోయారు. దానితో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, మరియు సమాచారం మేరకు అక్కడకి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించేలోపు వారంతా అగ్నికి ఆహుతయ్యారు. ఇద్దరు చిన్నారులతో సహా అంతా సజీవదహనం అయ్యారు.
అక్రమ సంబంధమే ప్రమాదానికి కారణమా
అయితే ఈ ప్రమాదానికి అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది. శాంతయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యతో గొడవపడి పద్మ, శివయ్య దంపతుల ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా శివయ్య, సాంతయ్య మిత్రులు అని ఆ సాన్నిహిత్యంతోనే ఇలా వారి ఇంట్లో ఉంటున్నాడని ఈ క్రమంలోనే శాంతయ్యకు పద్మకు మధ్య అక్రమ సంబంధం నడిచిందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసిన గిట్టనివేరు అర్థరాత్రివేళ ఇంటికి నిప్పంటి వెళ్లారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం పై ఆరా తీస్తున్నారు. మృతులను శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), మరియు మౌనిక(25) ఆమె చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2), మరో వ్యక్తి శాంతయ్య(50)గా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘోర ప్రమాదం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసులో 60కు చేరిన మృతుల సంఖ్య.. ఒక్కరూపాయి పరిహారం ఇవ్వనంటున్న సీఎం..?