Last Updated:

YS Sharmila: సంక్రాంతి తర్వాతే పాదయాత్ర ప్రారంభిస్తాను.. వైఎస్ షర్మిల

పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని వైఎస్ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

YS Sharmila:  సంక్రాంతి తర్వాతే పాదయాత్ర ప్రారంభిస్తాను.. వైఎస్ షర్మిల

YS Sharmila : పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని వైఎస్ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. షర్మిల పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు షర్మిల ఇంటిముందు బారికేడ్లను తొలగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డుపై షర్మిల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు సూచించింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు, కార్యక్రమాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

పాదయాత్ర ను ప్రారంభించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి కేసీఆర్ సర్కార్‌కు మొట్టికాయ వేసిందన్నారు. నిరహార దీక్ష చేస్తుంటే వందల మంది పోలీసులతో కర్ఫ్యు విధించారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కేసీఆర్ అధీనంలోకి వెళ్ళిందని ఆరోపించారు. తనను కట్టడి చేసిన పోలీసులపై కేసు పెట్టనున్నట్లు షర్మిల తెలిపారు. సంక్రాంతి తర్వాతే పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు.

తెలంగాణ పని అయిపోయిందని ఇప్పుడు కేసీఆర్ బందిపోట్ల రాష్ట్ర సమితి పేరుతో దేశం మీద పడ్డారని షర్మిల అన్నారు. పోలీసులను కీలుబొమ్మలా వాడుకుంటున్న సీఎం కేసీఆర్.. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎంత సహనంతో ఉన్న తమపై వేధింపులు ఆగడం లేదని అన్నారు. హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్‌తో క

ఇవి కూడా చదవండి: