Hyderabad: పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఎందుకు చెల్లలేదు?- తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇదీ..
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది
Hyderabad: పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. కొంతమంది గడువు ముగిసిన తరువాత ఆయా చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వలన ఈ సమస్య వచ్చిందని తెలిపింది.
రెండేళ్లకిందట కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్లో చాలా మంది మృతి చెందారు. ఇలా ప్రాణాలు అర్పించిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ మే 22వ తేదీన 2022వ ఏడాదిలో 1,010 చెక్కులను పంపిణీ చేశారు.ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపైవిచారణ జరిపింది. అయితే అదంతా అవాస్తవమని సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.దే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ చేయించిందని ఆయన తెలిపారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 712 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చెక్కులను కేసీఆర్ అందించారు. కేసీఆర్ మొత్తం 1010 చెక్కులు పంపిణీ చేశారని అందులో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని ఆయన తెలిపారు.మిగతా వాటికి చెల్లింపులు జరగకపోవడానికి.. చెక్కులు బౌన్స్ కాదని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల సమయం ముగియడమే వల్లే ఇబ్బందని.. చెక్ బౌన్స్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలియజేశారు సీఎస్ సోమేష్ కుమార్.ఆ విచారణలో బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం వల్ల కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదని తేలింది. వాటిని రీవాలిడేట్ చేసి నగదు చెల్లింపులు పరపాలని ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. .