TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజులు జైలు శిక్ష, వెయ్యిరూపాయల జరిమానా
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
TTD EO Dharma Reddy: హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ లో ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ గా పని చేస్తున్న కొమ్ము బాబు ఇతరుల సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయాలని 2022 ఏప్రిల్ 13 వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ తీర్పును టీటీడీ అమలుపరచ లేదు. దీంతో టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, గోవిందరాజు ల పై కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్ దాకలయింది. దీనిపై కోర్ట్ స్పందిస్తూ దీనికి భాద్యుడయిన ధర్మారెడ్డి కి జైలు శిక్ష విధించింది. పిటిషనర్ తరపున న్యాయవాది కె. కె. దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు.కేంద్ర సర్వీసుకు చెందిన ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగించడానికి కేంద్రం నిరాకరించడంతో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి విలీనం చేసుకుని టీటీడీ ఈవోగా కొనసాగిస్తున్నారు. కేంద్ర డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు చెందిన ధర్మారెడ్డి డిప్యూటేషన్‌పై టీటీడీలో విధులు నిర్వర్తిస్తున్నారు.