Last Updated:

Health Tips : చలి కాలంలో ఈ టిప్స్ ఫాలో అయితే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు ..!

Health Tips : చలి కాలంలో ఈ టిప్స్ ఫాలో అయితే  కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు ..!

Health Tips : సాధారణంగా చలి కాలంలో ఎక్కువ బాధించే సమస్య కీళ్ల నొప్పులు. చల్లటి వాతావరణం సహజంగా కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. దీంతో చలి గాలికి నడవడం, కూర్చోవడం, పని చేయడం కొంతమేర కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే ఎముకల్లో బలం తగ్గుతుండడంతో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తరుణంలోనే ఈ నొప్పులను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి పోగొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…

  • చలికి బయటికి వెళ్లేటప్పుడు శీతాకాలపు దుస్తులను ధరించడం ముఖ్యం.
  • స్వెటర్లు, షూస్, సాక్స్ ధరించి వెళ్ళడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. దీంతో నొప్పులకు చెక్ పెట్టొచ్చు.
  • అలానే వ్యాయామం చేసేటప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.
  • ఇంటి లోపల వెచ్చగా ఉండేలా చూసుకోవాలి దీంతో కీళ్ల నొప్పులును కొంత తగ్గించవచ్చు.
  • కీళ్ళు లేదా ఎముకల నొప్పి తర్వాత వేడి నీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్‌ని ఆ ప్రదేశం లో పట్టి నొప్పిని నివారించవచ్చు.
  • వ్యాయామం చేసే సమయంలో కీళ్ల నొప్పులు లేదా ఎముకల నొప్పి వచ్చిన వెంటనే వ్యాయామాలను ఆపకూడదు.
  • కొంతసేపు మీ కదలికలను కంటిన్యూ చేయకపోతే ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.
  • మీ శరీరాన్ని చురుకుగా మరియు ఫిట్‌గా ఉంచడానికి వెచ్చని పూల్‌లో ఇండోర్ స్విమ్మింగ్, యోగా, నడక, వెయిట్ లిఫ్టింగ్ చేయవచ్చు.
  • అలాగే, వెచ్చని స్నానం మీ కండరాలకు విశ్రాంతి ఇనిస్తుంది, మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • చలికాలంలో కూడా మనం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుండాలి. అందుకే ఎక్కువగా నీరు తాగాలి.
  • చలికాలంలో వేడి ఆహారాన్ని, నూనెతో కూడిన స్నాక్స్‌ను తీసుకోవడం తగ్గించాలి.
  • గోళ్లను బలోపేతం చేసే కాల్షియం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

ఈ సూచనలను పాటించి కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: