Trending News : సీత మీద అలకతో 42 ఏళ్లుగా అన్నం ముట్టని రామ… ఎక్కడంటే !
Trending News : భార్యభర్తల సంబంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కలకలం ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇదంతా ఓ వైపు అయితే మరోవైపు భార్య భర్తల మధ్య గొడవలు రావడం సర్వ సాధారణం. పెళ్లి చేసుకున్న ఏ జంటని అయిన ఇప్పటి వరకు ఎప్పుడైనా గొడవ
Trending News : భార్యభర్తల సంబంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కలకలం ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇదంతా ఓ వైపు అయితే మరోవైపు భార్య భర్తల మధ్య గొడవలు రావడం సర్వ సాధారణం. పెళ్లి చేసుకున్న ఏ జంటని అయిన ఇప్పటి వరకు ఎప్పుడైనా గొడవ పడ్డారా అంటే లేదనే చెప్పేవారు బహుశా ఉండకపోవచ్చు. కానీ ఎన్ని గోడవలు వచ్చిన , అడ్డంకులు ఎదురైన కాపురాన్ని కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం. అయితే ఇక్కడ ఒక విచిత్ర ఘటన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
రామచంద్ర, సీత లాంటి అన్యోన్య దంపతుల పేర్లతో ఉన్న వీరు కూడా ఒకప్పుడు మంచి అన్యోన్య జంటే. కానీ భార్య మీద అలకతో గంట కాదు, రోజు కాదు, ఏకంగా 42 సంవత్సరాల నుంచి రాముడు అన్నం తినటం మానేశాడు. అవును వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ దాదాపు 42 ఏళ్లుగా అన్నం తినటం లేదు. మరి అసలు ఆయన ఎలా జీవిస్తున్నారు ? వారి మధ్య అలకకు కారణం ఏంటి ? అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా…
జైపుర్ జిల్లా లోని వికీపుర్ గ్రామానికి చెందిన 76 ఏళ్ల రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే ఆమెతో వివాహం జరిగింది. కూలి పనులు చేసుకొని జీవనం సాగించే ఆయన… అప్పుడప్పుడు ఎండు చేపలు కూడా అమ్ముతుంటాడు. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉండగా… వారందరికి వివాహాలు కూడా జరిగాయి. కూలి పనులు చేసుకుంటూ కూడా సంతోషంగా కలిసి ఉండేవారు. అయితే దాదాపు 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఒకరోజు కూలి పనులకు వెళ్లొచ్చిన రామచంద్ర ఇంటికొచ్చిన తర్వాత భార్యని అన్నం పెట్టమని అడిగాడు.
కానీ ఆమె ఇంటి పనులు, అనారోగ్యం కారణంగా వంట చేయలేదని చెప్పింది. దీంతో రామ చంద్రకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఇక అంతే… నీ చేత్తో ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టను, అసలు అన్నమే తినను అంటూ చెప్పి బయటకు వెళ్లిపోయాడట. కోపంలో అన్నారు అనుకోని ఆమె కూడా ఆ విషయాన్ని అంతా సీరియస్ గా తీసుకోలేదట. కానీ ఆయన నిజంగా అన్నం తినటం మానేస్తాడని అస్సలు ఊహించలేదట. అంతేకాదు భార్య మీద కోపంతో వారి ఇంటి ముందే ఓ గుడిసె వేసుకుని అక్కడే జీవిస్తున్నాడు రామ చంద్ర. సీత ఎంతగానో నచ్చ చెప్పినప్పటికి రామచంద్ర వినలేదు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, బంధువులు చాలా మంది నచ్చ చెప్పిన కూడా రామచంద్ర మాట వినలేదు.
ఇక అప్పటి నుంచి కేవలం టీ తాగుతు అటుకులు మాత్రం తింటున్నాడు. సీత కొడుకులు కోడళ్లతో కలిసి ఉంటోంది. వారి ఇంటి ఎదురుగా వేసుకున్న గుడిసెలో రామచంద్ర ఉంటున్నాడు. భార్య చేతి అన్నం తినకపోయినా రామచంద్ర తన రోజువారి సంపాదనలో కొంత భార్యకు ఇస్తుంటాడు. అలా అప్పటి నుంచి భార్య సీత బతిమాలినా అన్నం మాత్రం తిననంటూ అలాగే ఉండిపోయాడు రామచంద్ర. మరి ఇన్నాళ్ళకు అయిన రామచంద్ర తన పంతాన్ని వీడి అన్నం తింటే బాగుంటుంది అని అంతా కోరుకుంటున్నారు. కోపాన్ని పక్కన పెట్టి మిగిలిన జీవితాన్ని అయిన కుటుంబ సభ్యులతో సుఖంగా గడపాలని ఈ విషయం తెలిసిన వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది.