Ysrcp : వైసీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ జగన్‌కి షాక్… పార్టీ అకౌంట్లోకి ఎలాన్ మస్క్, కోతులు…
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది.
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది. కాగా ఆ అకౌంట్ లో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు.
అదే విధంగా ప్రొఫైల్ పిక్, బయోడేటాను హ్యాకర్లు మార్చేశారు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. హ్యాక్‌కు గురైన ట్విట్టర్ అకౌంట్‌ను రీకవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాకింగ్ వ్యవహారం ఏపీలో ఆసక్తికరంగా మారింది.
🌎To support crypto community, Elon Musk initiated 5.000 BTC and 100.000 ETH GIVEAWAY
💰First come,first served: https://t.co/nV9MalCPDu
📌Note: you can take a gift only once. Please hurry up!!!
— YSR Congress Party (@YSRCParty) December 10, 2022
గతంలో కూడా హ్యాకర్లు పలు రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. కాగా తెలుగుదేశం పార్టీ ఖాతాని కూడా ఇప్పటికీ 3 సార్లు హ్యాక్ చేశారు. కాగా పోలీసులు సైబర్ నెరగాళ్లపై చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో పలు విచిత్రమైన పోస్ట్ లను పోస్ట్ చేశారు.
ఈ నేపధ్యంలోనే జగన్ పార్టీలో కోతులు, ఎలాన్ మస్క్ చేరారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు, కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ కూడా ఈ విషయం గురించి ఆరా తీసినట్లు సమాచారం అందుతుంది.