France: 25 ఏళ్లలోపు యువతీయువకులకు ఫ్రీగా కండోమ్స్.. న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
France: ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఫ్రాన్స్ దేశంలో యువత ఎక్కువగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఇటీవల కాలంలో అవాంఛిత గర్భధారణల సంఖ్య ఎక్కువైపోయింది. దానితో యువత ఎక్కవగా జనన నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలా యుక్తవయస్సులోనే దేశంలోని యువత అంతా ఈ ఆపరేషన్ వైపు మొగ్గుచూపడాన్ని గమనించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అవాంఛిత గర్భాలను తగ్గించేందుకు, 18 నుంచి 25 ఏళ్లలోపు వారికి మెడికల్ షాపుల్లో ఉచితంగా కండోమ్‌లను అందజేస్తామని మేక్రాన్ గురువారం ప్రకటించారు.
“ఇది గర్భనిరోధకం కోసం మొదలైన ఒక చిన్న విప్లవం” అని ఫోంటైన్-లె-కామ్టేలో జరిగిన ఆరోగ్య చర్చలో మేక్రాన్ వెల్లడించారు. ఫ్రెంచ్ ఆరోగ్య అధికారుల ప్రకారం, దేశంలో 2020 మరియు 2021లో లైంగికంగా సంక్రమించే వ్యాధుల( STD) రేటు 30 శాతం పెరిగింది. 2022 ప్రారంభం నుండి, 18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు గర్భనిరోధక మాత్రలు, గర్భసంచి లోపలే గర్భనిరోధక లూప్ (IUD)లు, గర్భనిరోధక ప్యాచ్‌లు మరియు ఇతర దీర్ఘకాలిక గర్భనిరోధకాలు ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువతులు గర్భనిరోధకాన్ని వదులుకోకుండా నిరోధించడానికి 18 ఏళ్లలోపు వారి కోసం ఒక కార్యక్రమాన్ని విస్తరించిందని ఓ వార్త సంస్థ తన కథనంలో వివరించింది.
ఎయిడ్స్ మరియు ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDలు) వ్యాప్తిని ఎదుర్కోవడానికి ఇప్పటికే వైద్యుల సూచన మేరకే కండోమ్స్ ల విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పేర్కొనింది. కాగా తాజాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ప్రకటించిన ఈ నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలుకానుంది. దీని ద్వారా యువత ఆరోగ్యకరమైన లైంగిక చర్యల్లో పాల్గొంటారని తద్వారా అవాంఛిత గర్బధారణలను మరియు STDల వ్యాప్తిని నిరోధించవచ్చని వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అలలై ఎగసిన మేఘాలు..!